దక్షిణాది రాష్ట్రాల్లో ప్రత్యేక దేశం కావాలనే డిమాండ్లు పెరిగిపోతున్నాయట.  ఈ విషయాన్ని ఎల్లోమీడియా బయటపెట్టింది. ఇంతకీ దక్షిణాది రాష్ట్రాల్లో ప్రత్యేకదేశం డిమాండ్లు ఎందుకు పెరిగిపోతోంది ? ఎందుకంటే వెంకయ్యనాయుడుకు  రాష్ట్రపతి పదవి ఇవ్వకపోవటంతో దక్షిణాది రాష్ట్రాల్లో బాగా మంటమొదలైపోయిందట. నిజానికి దక్షిణాది రాష్ట్రాలు తమను ప్రత్యేక దేశంగా ప్రకటించాలని ఎప్పటినుండో డిమాండ్లు చేస్తున్నాయట.





అయితే ఇంతకాలం లోలోపలగా ఉన్న డిమాండ్లు వెంకయ్య విషయంలో ఒక్కసారిగా బయటపడిందని ఎల్లోమీడియా చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. అసలు వెంకయ్యకు రాష్ట్రపతి పదవి వస్తుందని ఎవరూ అనుకోలేదు. ఎందుకంటే వెంకయ్యను మోడీ దూరంపెట్టిన విషయం అందరికీ తెలుసు. కాబట్టి వెంకయ్యకు రాష్ట్రపతి వస్తుందని, రావాలని ఎల్లోమీడియా తప్ప ఇంకెవరు అనుకోలేదు. ఏదో ఒక విధంగా మ్యానేజ్ చేద్దామని వెంకయ్యకు రాష్ట్రపతి పదవంటు ఎల్లోమీడియా విపరీతంగా ఊదరగొట్టేసింది.





తాము అనుకున్నట్లుగా వెంకయ్యకు రాష్ట్రపతి పదవి దక్కకపోవటంతో ఎల్లోమీడియా తెగ బాధిపడిపోతోంది. రాష్ట్రపతి పదవి రానందుకు నిజంగా వెంకయ్యకు బాధుందో లేదో తెలీదు కానీ ఎల్లోమీడియా బాధమాత్రం చెప్పనలవికాకుండా ఉంది. తన బాధలో నుండి బయటపడేందుకు వెంటనే దక్షిణాది రాష్ట్రాలన్నీ కలిసి ప్రత్యేకదేశంగా ఏర్పాటుచేయాలనే డిమాండ్ పెరిగిపోతోందంటు కలరింగ్ ఇచ్చుకుంటోంది. అసలు వెంకయ్య రాష్ట్రపతి కావాలని ఏ రాష్ట్రం అనుకున్నదో అర్ధమే కావటంలేదు.





ఎల్లోమీడియా ప్రకారం ఏపీ, తెలంగాణా, కేరళ, తమిళనాడులో ప్రత్యేక దేశం డిమాండ్ బలంగా వినిపిస్తోందట. ప్రత్యేక దేశం కావాలని దక్షిణాది రాష్ట్రాల నుండి డిమాండ్ ఉన్న విషయం ఎల్లోమీడియా ద్వారానే అందరికీ తెలిసింది. విచిత్రం ఏమిటంటే వెంకయ్యకు రాష్ట్రపతి రాకపోవటంపై ఎల్లోమీడియా చెప్పిన రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రం కూడా నిరసన వ్యక్తంకాలేదు. పైగా బీజేపీ నేతల్లో ఒక్కళ్ళు కూడా వెంకయ్యకు రాష్ట్రపతి పదవి ఇవ్వాలని డిమాండ్ వినిపించలేదు. వాస్తవం ఇలాగుంటే ఒక్క ఎల్లోమీడియా మాత్రమే వెంకయ్యకు దక్షిణాది రాష్ట్రాల ప్రత్యేక దేశం డిమాండ్ కు ముడిపెట్టి గోల గోల చేస్తోంది.  









మరింత సమాచారం తెలుసుకోండి: