మహారాష్ట్ర ప్రభుత్వం కుప్పకూలిపోతోంది. దాదాపుగా పతనం అంచున ఉంది. రాజీనామా ఒక్కటే బ్యాలెన్స్. ఈ దశలో ఇప్పుడు కంగనా రనౌత్ టాపిక్ హైలెట్ అవుతోంది. అసలు కంగనా రనౌత్ కి, మహారాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఏంటి..? ఉద్ధవ్ థాక్రే సీఎం కుర్చీ దిగిపోడానికి, కంగనాకి లింక్ ఏంటి..? అనుకుంటున్నారా..? అక్కడికే వస్తున్నాం.. ఆమధ్య కంగనా రనౌత్ కి సంబంధించిన ఓ ఇంటిలో కొంత భాగాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం కూల్చేసింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారంటూ ముంబై కార్పొరేషన్ అధికారులు కొంత భాగాన్ని తొలగించారు. అప్పట్లో కంగనా రనౌత్ కి, ఉద్ధవ్ ఠాక్రేకి మధ్య సోషల్ మీడియాలో మాటల తూటాలు పేలాయి. వాటిని ఇప్పుడు గుర్తు చేస్తున్నారు నెటిజన్లు.

‘‘ఉద్ధవ్‌ ఠాక్రే.. మీ గురించి మీరేం అనుకుంటున్నారు? నా ఇల్లు కూల్చేసినంత మాత్రాన నన్ను ఇబ్బంది పెడుతున్నామని అనుకుంటున్నారా..? ఈరోజు మీరు నా ఇంటిని కూల్చేశారు కదా, రోజులు ఎప్పుడూ ఒకేరకంగా ఉండవు, రేపు మీకు రోజు వస్తుంది. అప్పుడు మీ అహంకారం కూడా ఇలాగే కూలబడిపోతుంది. కాలం పరిగెడుతుంది, ఒకేలా ఉండదు గుర్తుంచుకోండి..’’  అంటూ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేను హెచ్చరిస్తూ కంగనా చెప్పిన మాటలున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కంగనా శాపం కారణంగానే ఇప్పుడు ఉద్ధవ్ ప్రభుత్వం కూలిపోయిందని అంటున్నారు. అది కేవలం యాదృచ్ఛికమే అయినా అప్పుడు ఆమె అన్న మాటలు ఇప్పుడు నిజమేననిపిస్తున్నాయి. అంతే కాదు, ఆ ప్రకారమే ఇప్పుడు పరిణామాలు జరిగాయని అనిపిస్తోంది. దీంతో సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ సర్క్యులేట్ అవుతోంది. ప్రస్తుతం మహారాష్ట్రలో రాజకీయం హాట్ హాట్ గా సాగుతోంది. శివసేనలో చీలిక వచ్చింది. ఉద్ధవ్ సీటు కిందకి నీళ్లొచ్చాయి. ఆయన ఉదాసీనత వల్లే ఇలా జరిగిందని అంటున్నారు. శివసేనపై ఆయనకు పూర్తి స్థాయిలో పట్టులేదని, నేతలను ఆయన చెప్పు చేతల్లో పెట్టుకోకపోవడం.. మరోవైపు ఎన్సీపీ, కాంగ్రెస్ తో శివసేన నేతలకు పడటంలేదని, అందుకే వారు బయటకు వెళ్లిపోతున్నారని తెలుస్తోంది. శివసేనలో ఉన్న బీజేపీ అభిమానులంతా ఒక్కటయ్యారు. ఒక్కొక్కరే పార్టీని వీడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: