తాము నిజాలు మాట్లాడితే చంద్రబాబు, లోకేష్ బయటకెళ్లి ఏడుస్తారంటూ సెటైర్లు వేశారు మంత్రి గుడివాడ అమర్ నాథ్. ఎన్టీఆర్‌ వారసుడిని అని చెప్పుకునే అర్హత లోకేష్ కి లేదని విమర్శించారాయన. తాము ఏదైనా అంటే.. చంద్రబాబు లోకేష్ బయటకెళ్లి ఏడుస్తారంటూ సెటైర్లు వేశారు. దావోస్‌ పర్యటన గురించి తామెప్పుడూ చంద్రబాబు లాగా ప్రచారం చేసుకోలేదన్నారు. తాము ప్రజలకు చేయాలనుకున్నది చేస్తున్నామని, వారి అభిమానమే తమకు శ్రీరామ రక్ష అని చెప్పారు అమర్ నాథ్. చంద్రబాబుకి అధికార దాహం ఎక్కువ అని, ఆయన తన అధికారం కోసం సొంత భార్యనే రోడ్డు మీద నిలబెట్టారని అన్నారు. అంతకంటే ఆయన గురించి ఏమి చెప్పలేమని అన్నారు అమర్ నాథ్. చంద్రబాబు, లోకేష్‌ ఇంకా భ్రాంతుల్లోనే బతుకుతున్నారని, ఏపీ బ్రాండ్‌ ఇమేజ్‌ ని దెబ్బతీసే విధంగా ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయంటూ మడిపడ్డారు అమర్ నాథ్.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత లక్షా 40వేల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలకోసం ఖర్చు చేశామని అన్నారు మంత్రి గుడివాడ అమర్ నాథ్. ఏపీలో పారిశ్రామిక రంగానికి వైసీపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని చెప్పారు మంత్రి అమర్ నాథ్. రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు వస్తున్నాయని, ఆయా పరిశ్రమలకు కావాల్సిన మౌలిక వసతులను ప్రభుత్వం అందిస్తోందన్నారు. కొత్తగా రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుతున్నామని చెప్పారు అమర్ నాథ్.

ఏపీలో చంద్రబాబు హయాంలో ఎక్కడా ఎలాంటి అభివృద్ధి జరగలేదని, సీఎం జగన్‌ ప్రభుత్వంలో ఇన్ఫోసిస్‌ లాంటి దిగ్గజ సంస్థలు ఏపీకి వస్తున్నాయని చెప్పారాయన. గడచిన మూడేళ్లలో పారిశ్రామిక అభివృద్ధి కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. రెండేళ్లపాటు కోవిడ్‌ తో పోరాటం చేశామని, ఏపీలో పరిశ్రమల అభివృద్ధికోసం నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు మంత్రి. ఏపీలో 974 కిలో మీటర్ల సముద్ర తీరం ఉందని, అదే మనకు మంచి అవకాశాలను తెచ్చిపెడుతోందని చెప్పారు. ఏపీలోని కోస్తా తీరంలో పోర్టులు, ఫిషింగ్ హార్బర్ నిర్మాణాలను ముఖ్యమంత్రి చేపడుతున్నారని చెప్పారు మంత్రి.

మరింత సమాచారం తెలుసుకోండి: