షెడ్యూల్ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికారపార్టీ ఎంఎల్ఏల వైఖరిలో మార్పు బయటపడుతోంది. ఇప్పటికి ఇద్దరు ఎంఎల్ఏల వైఖరి ఏమిటో బయటపడింది. ఇందులో ఒకరు కడప జిల్లా ఎంఎల్ఏలు రాచమల్లు శివప్రసాదరెడ్డి అయితే మరొకరు నెల్లూరు రూరల్ ఎంఎల్ఏ కోటంరెడ్డి శ్రీధరరెడ్డి. ఇద్దరు మాట్లాడిన మాటలు విచిత్రంగా ఉండటమే కాకుండా పార్టీ నేతలు, కార్యకర్తలనే ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.





ఇంతకీ కోటంరెడ్డి ఏమన్నారంటే అధికారం ఉందికదాని ప్రతిపక్షం నేతలపై కక్షసాధింపులకు దిగొద్దన్నారు. ప్రతిపక్షపార్టీల నేతలు, కార్యకర్తలను శతృవులుగా చూడదన్నారు. అధికార మదం తలకెక్కితే, అధికారమదంతో వ్యవహరిస్తే జనాలు చెప్పాల్సిన రోజు, చెప్పాల్సిన పద్దతిలో బుద్ధి చెబుతారట. ఇక్కడ విషయం ఏమిటంటే రాష్ట్ర రాజకీయాల్లో హుందాతనం పోయి చాలాకాలమైపోయింది. వైసీపీ-టీడీపీ నేతల్లో చాలామంది ఒకరిని మరొకరు జన్మ విరోధులుగా చూసుకుంటున్నారు. ఈ పద్దతి అసలు మొదలైందే చంద్రబాబునాయుడుతో.





2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్దిని రాజకీయంగా అణగదొక్కేయాలని చాలా ప్రయత్నాలే చేశారు. ఇందులో భాగంగానే వైసీపీ ఎంఎల్ఏలను లాగేసుకోవటం, కేసులుపెట్టి అరెస్టులు చేయటం, జైళ్ళకు పంపటం ఇలా చాలానే చేశారు. ఇపుడు అధికారంలో ఉన్న జగన్ ప్రతీకార చర్యలూ అలాగే ఉంటున్నాయి. ఎదుటివాళ్ళనుండి మర్యాద కోరుకుంటున్నపుడు ముందు ఎదుటివాళ్ళకి మనం మర్యాదివ్వాలన్న కనీస ఇంగితాన్ని కూడా చంద్రబాబు కోల్పోయారు.





ఇక రాచమల్లు విషయానికి వస్తే జగన్ అత్యంతగా ధ్వేషించే ఈనాడు దినపత్రికను బహిరంగంగా అభినిందించటం. ఇదే సమయంలో జగన్ సొంతపత్రిక సాక్షిగురించి చాలా చీపుగా మాట్లాడారు. సాక్షిగురించి చీపుగా మాట్లాడాల్సిన అవసరంలేదు. అలాగే ఈనాడును అభినందించాల్సిన అవసరమూలేదు. అయినా రెండూ బహిరంగంగానే చేశారంటే అర్ధమేంటి ? లోలోపల ఏదో పెట్టుకునే బయటకు ఇలా వ్యాఖ్యలు చేసినట్లు అర్ధమైపోతోంది. కాబట్టి బయటపడుతున్న ఎంఎల్ఏల వైఖరి ఏమిటో చాలామంది నేతలకు అర్ధం కావటంలేదు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఇద్దరు కూడా జగన్ కు స్ట్రాంగ్ మద్దతుదారులే. కాబట్టి వీళ్ళ వైఖరిని ఒకకంట కనిపెట్టాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: