‘భయమంటే ఏమిటో మా బయోడేటాలోనే లేదు’..తామేంటో తొందరలోనే అందరికీ చూపిస్తామంటు రెండు రోజుల క్రితమే నారా లోకేష్ చెప్పారు. జగన్మోహన్ రెడ్డి లాగ తాము పిరికివాళ్ళం కామని భయమనేది  అసలు  తమ బ్లడ్డులోనే లేదంటు చాలా గంభీరంగా ప్రకటించారు. కాసేపు లోకేష్ చెప్పింది నిజమనే అనుకుందాం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏపీలో చేస్తున్న ఆందోళనలు, నిరసనలు తెలంగాణాలో ఎందుకు చేయటంలేదు ?






ప్రతి విషయంలోను జగన్ను టార్గెట్ చేసి బురదచల్లేసినట్లుగా కేసీయార్ గురించి ఎందుకు మాట్లాడటంలేదు ? కేసీయార్ కు వ్యతిరేకంగా అసలు తండ్రి, కొడుకులకు కలలో అయినా ఆందోళనలు, నిరసనలు తెలుపుతున్నారా ? జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మరి తెలంగాణాలో కూడా కేసీయార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాదుడేబాదుడు కార్యక్రమం ఎందుకు నిర్వహించటంలేదు ?





ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు యాత్రలు ఏపీలో మాత్రమేనా తెలంగాణాలో ఉండవా ? కేసీయార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణాలో కూడా చంద్రబాబు యాత్రలు మొదలుపెట్టవచ్చు కదా. కేసీయార్ ను టార్గెట్ చేస్తు ఆరోపణలు, విమర్శలతో యాత్ర మొదలుపెడితే జనాలు తెలంగాణాలో కూడా బ్రహ్మరథం పడతారేమో. వచ్చే ఎన్నికల్లో జనాలు తెలుగుదేశంపార్టీని బంపర్ మెజారిటితో గెలిపిస్తారేమో కదా. ఆ విషయాన్ని తండ్రి, కొడుకులు ఎందుకు ఆలోచించటంలేదు.






ఎలాగూ టీడీపీ జాతీయపార్టీయే కదా. చంద్రబాబు జాతీయ అధ్యక్షుడు, లోకేష్ జాతీయ ప్రధాన కార్యదర్శి కదా. ఆ హోదాలో తెలంగాణాను ఎందుకని పూర్తిగా వదిలేశారు. అప్పుడెప్పుడో బయటపడిన ఓటుకునోటు కేసులో అరెస్టుకు భయపడి ధైర్యంగా హైదరాబాద్ నుండి విజయవాడకు పారిపోయిన చంద్రబాబు మళ్ళీ ఇంతవరకు రాజకీయంగా తెలంగాణాలో తిరిగిందే లేదు. కేసీయార్ కు వ్యతిరేకంగా నోరిప్పితే ఏమవుతుందో చంద్రబాబుకు బాగా తెలుసు. అందుకనే లోకేష్ కూడా నోరిప్పటంలేదు. మళ్ళీ భయమంటే ఏమిటో తమ బయోడేటాలోనే లేదంటు సొల్లు కబుర్లొకటి. రెండు రోజులు తెలంగాణాలో టూరు చేసి కేసీయార్ ను టార్గెట్ చేస్తే అప్పుడు వీళ్ళ ధైర్యమేంటో బయటపడుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: