తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు భారీగా కురుస్తున్నాయి.. గత వారం రోజుల నుంచి రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.. పలు జిల్లాల్లో భారీగా కురిసిన వర్షాలకు వాగులు వంకలు ఉప్పొంగి పోతున్నాయి. నెలలు తడవడం తో రైతన్నలకు సంతోషం వెళ్లు విరిసింది.. కొత్త పంటలు వెయ్యడానికి సిద్దం అయ్యారు.. ఇకపోతే ఇప్పుడు వాతావరణ శాఖ మరో బాంబ్ వేసింది. రానున్న మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించారు..


కొన్ని చోట్లు ఉరుముల తో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, యానాం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయి. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. రాయలసీమ లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. తెలంగాణ లో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మధ్య ప్రదేశ్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌, ఒడిశాల మీదుగా బంగాళాఖాతం వరకు 1,500 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడింది.


ఈ ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణం గా రైతులు అప్రమత్తం గా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించింది. వర్షాలు కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయట కు రావొద్దని విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్ లో ఆదివారం రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. ప్రధానంగా శివారు ప్రాంతాల్లో భారీగా వాన పడుతోంది. వర్షం వల్ల ఇవాళ ఉదయాన్నే కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో రహదారులపై నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.. వేరే రాష్ట్రాల లో ఇప్పటికే భారీగా కురిసిన వర్షాలకు వరదలు ఏర్పడ్డాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: