జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఇపుడు రైటు, లెఫ్ట్ మొత్తం నాదెండ్ల మనోహరే. పార్టీ నేతలను, సమావేశాలను పవన్ కన్నా ఎక్కువగా నాదెండ్లే నిర్వహిస్తుంటారు. రాష్ట్రంలో ఎక్కువగా నాదెండ్లే పర్యటిస్తుంటారు. పార్టీ నేతల్లో అత్యధికులు పవన్ కన్నా ఈయనకే రిపోర్టు చేస్తుంటారు.  పార్టీలో ఇంతటి కీలక పాత్రపోషిస్తున్న నాదెండ్లకైనా పవన్ మనసులో ఏముందో తెలుసా ? అనే డౌటు పెరిగిపోతోంది.





ఈ డౌటనుమానం ఎందుకు పెరిగిపోతోందంటే పవన్ చేస్తున్న ప్రకటనలు, మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న ఛాలెంజుల్లో ఎక్కడా ఒకదానికి ఇంకోదానితో పొంతన కుదరటంలేదు. పవన్ సూచనల ప్రకారం నాదెండ్ల నడుచుకుంటున్నారా ? లేకపోతే నాదెండ్ల డైరెక్షన్లో పవన్ నడుస్తున్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఒక విషయమైతే క్లారిటి ఉంది.





అదేమిటంటే పవన్ కన్నా నాదెండ్లకు రాజకీయ అనుభవం చాలా ఎక్కువుంది. అలాగని ఆయనేమీ తిరుగులేని నేతేమీకాదు. గుంటూరు జిల్లాలోని తెనాలిలో రెండుసార్లు కాంగ్రెస్ గెలిలోనే గెలిచారు. పార్టీ గాలుంటే గెలుపు లేకపోతే ఓడిపోవటమే. నాదెండ్లేమీ పెద్ద వ్యూహకర్త కాదు జనబలం ఉన్న నేతకూడా కాదు. ఏదో సన్నిహితుల ద్వారా పవన్ దగ్గరకు నాదెండ్ల చేరినట్లు చెప్పుకుంటున్నారు. పవన్ లాగా కాకుండా నాదెండ్ల కాస్త బ్యలెన్సుడుగానే మాట్లాడుతారు. కానీ ఆ బ్యాలెన్సే పవన్లో లోపించింది.





అందుకనే పవన్ రోజుకో ప్రకటన, ఛాలెంజ్ చేస్తు పార్టీ నేతల్లోను, జనాల్లోను అయోమయం పెంచేస్తున్నారు. సరే రేపటి ఎన్నికల్లో ఏదన్నా తేడా వచ్చిందంటే పవన్ కేమీ కాదు. హ్యాపీగా సినిమాల్లోకి వెళ్ళిపోయి షూటింగులతో బిజీ అయిపోతారు. నాదెండ్ల పరిస్ధితి ఏమిటన్నదే  అర్ధం కావటంలేదు. నిజంగానే పార్టీ  గాలి బలంగా ఉంటే జనసేన తరపున గెలిచే వాళ్ళల్లో పవన్+నాదెండ్ల కూడా ఉండచ్చు. ఒకవేళ లేకపోతే నాదెండ్ల పరిస్ధితి ఏమైపోతుంది ? ఎందుకంటే మరో ఐదేళ్ళు వెయిట్ చేసేంత ఓపిక కచ్చితంగా పవన్ కు ఉండదన్నది వాస్తవం. మరపుడు నాదెండ్లకే పూర్తి బాధ్యతలు అప్పగించేస్తారా ? లేకపోతే నాదెండ్లే మాయమైపోతారా ? చూడాలి ఏమి జరుగుతుందో.



మరింత సమాచారం తెలుసుకోండి: