నైరుతి రుతుపవనాల ఆగమనం తో హైదరాబాద్ లో కుండల తో నీళ్ళు పోసిన విధంగా వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే.. హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. పటాన్ చెరు, ఇస్నాపూర్, ముత్తంగి అవుటర్ రింగ్ రోడ్, శేరి లింగంపల్లి, రామచంద్రాపురం, చందానగర్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, మియాపూర్, సికింద్రాబాద్, మేడ్చల్, బాలా నగర్, కుత్బుల్లాపూర్, చింతల్, జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, కొంపల్లి, సుచిత్ర, దుండిగల్, కుషాయిగూడ, దమ్మాయిగూడ, చర్ల పల్లిలో వర్షం పడింది..


ఉరుములు, మెరుపుల తో కూడిన వర్షం తో రోడ్లపై భారీగా నీరు నిలిచిపోయింది. నాలాలు నిండిపోయి నీరంతా రోడ్ల పైకి చేరింది. పలుచోట్ల ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాప్రా, కుషాయిగూడ, తార్నాక, లాలాపేట, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్‌లో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మధ్యప్రదేశ్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌, ఒడిశాల మీదుగా బంగాళాఖాతం వరకు 1,500 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావం తో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా రైతులు అప్రమత్తం గా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.. ఉద్రిక్తంగా వర్షాలు కురుస్తున్న సమయంలో ఎవరూ ఇళ్ళ నుంచి బయటకు రావొద్దని హెచ్చరించినట్లు తెలుస్తుంది.


ఆంధ్రప్రదేశ్ లోనూ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని చోట్ల ఉరుముల తో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, యానాం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయి. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. రాయలసీమ లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు.. మొత్తానికి తెలుగు రాష్ట్రాలు జల కళను సంతరించుకున్నాయి.. రైతులకు ఒకరకంగా మంచి జరిగిందని చెప్పాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: