ప్రస్తుతం పెట్రోల్ డీజిల్ అనే పేరు వినిపిస్తే చాలు సామాన్యులు వణికిపోతున్నారు. ఎందుకంటే ఆ రేంజ్ లో పెట్రోల్ ధరలు కొనసాగుతూ ఉన్నాయనే చెప్పాలి. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర దాదాపు 110 రూపాయలుగా  కొనసాగుతోంది. దీంతో సామాన్యుడు వాహనం బయటకు తీయాలి అంటేనే భయపడిపోతున్నాడు. అత్యవసరమైతే తప్ప బండి ముట్టుకోవడం లేదు.  అయితే ఇటీవలి కాలంలో పెట్రోల్ బంకుల్లో మోసాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ఇక పెట్రోల్ కొట్టించుకునే ప్రతీసారి కూడా పెట్రోల్ సరిగా వస్తుందా లేదా అనే ఒక ఆలోచన ప్రతి ఒక్కరి మదిలో మెదులుతూ ఉంటుంది.


 అదే సమయంలో మనం ఏ సమయంలో పెట్రోల్ కొట్టేస్తాం అన్న విషయం కూడా పరిగణలోకి వస్తుంది అన్న విషయం ఇటీవల తెర మీదికి వచ్చి హాట్ టాపిక్ గా మారిపోయింది.  చాలామంది రాత్రిపూట పెట్రోల్ కొట్టిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. రాత్రి సమయంలో లేదా ఉదయం ఆరు గంటల లోపు పెట్రోల్ కొట్టించడం వెనక ఒక రహస్యం దాగి ఉందట. దాదాపు అందరికీ తెలుసు పెట్రోల్ కి ఆవిరి అయ్యే గుణం ఎక్కువగా ఉంటుంది. ఒక లీటర్ పెట్రోల్ తీసుకొచ్చి ఒక ప్లాస్టిక్ బాటిల్ లో పోసి మూత పెట్టకుండా అలాగే ఎండలో ఉంచితే కేవలం 5 నిమిషాల్లో పెట్రోలు మొత్తం ఆవిరైపోతుంది.


 సూర్యరశ్మితో ఎండ వేడి ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా అవడం జరుగుతుంటుంది. ఈ క్రమంలోనే మధ్యాహ్నం పూట పెట్రోల్ కొట్టిస్తే ఎండవేడికి కొంచెం తక్కువగానే పెట్రోల్ వస్తుందట. అందుకే రాత్రిపూట లేదా ఉదయం ఆరు గంటల లోపు పెట్రోల్ కొట్టించుకోవటం వల్ల ఎండ వేడి  తగిలే అవకాశం లేదు కాబట్టి ఇక పెట్రోల్ కాస్త ఎక్కువగానే వస్తుందట. కానీ కొంతమంది ఏం చెబుతున్నారంటే పెట్రోల్ డీజిల్ను అండర్ గ్రౌండ్ లో స్టోర్ చేస్తూ ఉంటారు. అక్కడ ఎండ తగిలినా ఆవిరి అవ్వడం  లాంటివి ఉండదు. అందుకే రాత్రి పగలు ఎప్పుడు పెట్రోల్  కొట్టించిన ఒకేలాగా వస్తుందని మరి కొంతమంది చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: