తెలంగాణాలో ప్రధాన పార్టీలైన అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ నేతల మధ్య పోస్టర్ల యుద్ధం కొత్తగా మొదలైంది. ఇంతకాలం నోటికి మాత్రమే పనిచేప్పిన నేతలు ఇపుడు కొత్తగా పోస్టర్లు వేసి యుద్ధానికి దిగారు. కేసీయార్ కు వ్యతిరేకంగా కొన్ని పోస్టర్లు వెలిస్తే దానికి కౌంటర్ గా మోడీకి వ్యతిరేకంగా నగరమంతా ఫ్లెక్సీలు ఏర్పాటవ్వటం గమనార్హం. ముందుగా కేసీయార్ కు వ్యతిరేకంగా ‘సాలు దొర..సెలవు దొర’ అనే పోస్టర్లు పెద్దపెద్దవి వెలిశాయి. ఇందులోనే కల్వకుంట్ల కౌంట్ డౌన్ అంటు డిజిటల్ క్లాక్ ను కూడా బిగించారు.





ఎప్పుడైతే కేసీయార్ కు వ్యతిరేకంగా పెద్ద పోస్టర్లు వెలిశాయో వెంటనే కౌంటర్ గా మోడీకి వ్యతిరేకంగా పోస్టర్లు మొదలయ్యాయి. మోడీకి వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లలో ‘సాలు మోడీ..సంపకు మోడీ..బైబై మోడీ’ అంటు వినైల్ పోస్టర్లు నగరమంతా కనబడుతున్నాయి. మోడీకి వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లలో ప్రభుత్వ రంగ సంస్ధలను అమ్మేయటం, రైతులను ఇబ్బందులు పెట్టడం, ఎల్ఐసీని ప్రైవేటుపరం చేయటం లాంటి మరో మూడు ప్రజావ్యతిరేక నిర్ణయాలు కూడా ఉన్నాయి.





జూలై 3-5 తేదీల మధ్య బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు నరేంద్రమోడి వస్తున్నారు. అంటే మోడీ మూడు రోజుల పాటు హైదరాబాద్ లోనే ఉండబోతున్నారు. కేంద్రమంత్రులు, ఎంపీలు, బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా లాంటి కీలక నేతలంతా మూడు రోజులు ఇక్కడే ఉండబోతున్నారు. మోడీ రాకసందర్భంగా కమలనాదులు నగరాన్ని పోస్టర్లు, జెండాలతో ముంచెత్తేయాలని అనుకున్నారు. కానీ అనూహ్యంగా మోడీకి వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లతో అందరు ఖంగుతిన్నారు.






సరే బీజేపీ నేతలిచ్చిన ఫిర్యాదులతో ఆ పోస్టర్లను అధికారులు తొలగిస్తున్నారు. ఇక్కడే బీజేపీ నేతల విచిత్రవైఖరి బయటపడింది. తాము కేసీయార్ కు వ్యతిరేకంగా పోస్టర్లు వేస్తే మోడీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ పోస్టర్లు వేయకుండా ఉంటుందా ? కేంద్రంలో అధికారంలో మోడీ ఉంటే రాష్ట్రంలో కేసీయారే రాజు కదా. కేసీయార్ ను అనవసరంగా కెలకటం ఎందుకు ? మోడీకి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిసేట్లు చేసుకోవటం ఎందుకు ?  

మరింత సమాచారం తెలుసుకోండి: