ముంబయ్ లో ఒక్కసారిగా హై టెన్షన్ పెరిగిపోయింది. మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వం భవితవ్వం మరికొద్ది గంటల్లో తేలిపోయే అవకాశాలున్నాయి. ఎందుకంటే గురువారం సాయంత్రంలోగా అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాలని ముఖ్యమంత్రి ఉధ్థవ్ థాక్రేని గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ ఆదేశించారు. బలనిరూపణ విషయాన్ని పక్కనపెట్టేస్తే తిరుగుబాటు నేత, మంత్రి ఏక్ నాథ్ షిండే నాయకత్వంలోని మంత్రులు, ఎంఎల్ఏలు గురువారం ముంబయ్ లోకి అడుగుపెడుతున్నారు.


గడచిన వారంరోజులుగా సూరత్, గువహతిలో క్యాంపుల్లో ఉంటున్న వారంతా ముంబయ్ లోకి అడుగుపెట్టబోతున్నారు. వీళ్ళందరు ఎప్పుడు నగరంలోకి అడుగుపెడతారా ? అని శివసేన నేతలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ముంబయ్ లోకి అడుగుపెట్టబోతున్న తిరుగుబాటు వర్గం నేతలకు ఏమవుతుందో అనే టెన్షన్ బాగా పెరిగిపోతోంది. ఇప్పటికే తిరుగుబాటు వర్గం మద్దతుదారులకు, శివనేన నేతలకు మధ్యా బాగా గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే.


ఏ నిముషంలో ఏమి జరుగుతుందో అర్ధంకాకే పోలీసు కమీషనర్ నగరం మొత్తంమీద 144వ సెక్షన్ విధించారు. అయితే ఈ ఆంక్షలను ఎవరు పాటించటంలేదు. దాంతో రెండువర్గాలను ఎలా కంట్రోల్ చేయాలో పోలీసులకు అర్ధం కావటంలేదు. సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టి సీఎం ఉథ్ధవ్ థాక్రేని దెబ్బకొట్టాలని షిండే నాయకత్వంలోని వర్గం బలంగా కోరుకుంటోంది. ఇదే సమయంలో ఎలాగైనా సరే బలప్రదర్శనలో గెలవాలని థాక్రే వర్గం ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రయత్నాల్లోనే తిరుగుబాటు వర్గంలోని నేతలకు ఏమవుతుందో చెప్పలేకపోతున్నారు.

ఈ కారణం వల్లే ముంబాయ్ లో హై ఓల్టేజ్ రాజకీయాలు నడుస్తున్నాయి. గంట గంటకు రాజకీయం మారిపోతోంది. ఈ నేపధ్యంలో గవర్నర్ ఆదేశాలపై అభ్యంతరం చెబుతు శివసేన నేతలు సుప్రింకోర్టులో కేసు కూడా వేశారు. కోర్టు ఆదేశాలను పక్కనపెట్టేస్తే తామే తిరుగుబాటు వర్గాన్ని ఎలా ఎదుర్కోవాలనే విషయమై శివసేన నేతలు ఆలోచిస్తున్నారు. వీళ్ళ ఆలోచనలు ఏవీ స్పష్టగా బయటకు కనబడటంలేదు. అందుకనే లోలోపల ఏమి ప్లాన్ చేస్తున్నారో మాత్రం ఎవరికీ అర్ధం కావటంలేదు. ఇందుకనే ముంబయ్ లో హై టెన్షన్ పెరిగిపోతోంది. చూద్దాం చివరకు ఏమవుతుందో.మరింత సమాచారం తెలుసుకోండి: