నిజంగా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీని పిలిచి అవమానించటమే. అసలు ఆహ్వానమే అందకపోతే అదో పద్దతి. కానీ ఆహ్వానంపంపించి మీరు కాకుండా మీ తరపున ఎవరినైనా పంపండి అని చెబితే ఎలాగుంటుంది ? ఇపుడు చంద్రబాబునాయుడుకు జరిగిందిదే. జూలై 4వ తేదీన ఏపీలో నరేంద్రమోడి పర్యటించబోతున్నారు. భీమవరంలో మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు.






ఇందులో భాగంగానే అన్నీ పార్టీలకు కేంద్రమంత్రి పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి నుండి ఆహ్వానాలు అందుతున్నాయి. ఇందులో భాగంగానే తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబుకు కూడా ఇన్వటేషన్ అందింది. అయితే అందులో ఏముందంటే మీ పార్టీ తరపున ప్రతినిధిని ఎవరినైనా పంపండి అని స్పష్టంగా ఉంది. చంద్రబాబుకు ఇన్విటేషన్ ఇచ్చి మీ తరపున ఎవరినైనా పంపండి అంటే అర్ధమేంటి ? చంద్రబాబును అవమానించటమే కదా.






మూడేళ్ళుగా మోడిని కలిసేందుకు, మోడి నుండి ఆహ్వానం వస్తుందని చంద్రబాబు ఎంతగా ప్రయత్నిస్తున్నారో అందరికీ తెలుసు. ఏదో పద్దతిలో బీజేపీతో పొత్తుపెట్టుకుంటే మళ్ళీ మోడితో చెలిమి చేద్దామని చంద్రబాబు ఎంతగానో తపిస్తున్నారు. ఇదే విషయమై ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఎంత ప్రయత్నించినా అటునుండి ఎలాంటి రెస్పాన్స్ కనబడటంలేదు. ఈ నేపధ్యంలోనే అల్లూరి పేరుతో ఆహ్వానం అందింది కాబట్టి వెంటనే భీమవరం వెళ్ళిపోయి మోడిని కలుద్దామని చంద్రబాబు అనుకునుంటారు.






కానీ ఆహ్వానమైతే అందింది కానీ మీరు కాదు ఇంకెవరినైనా పంపమని చెప్పటమే ఏవీ బావోలేదు. విచిత్రం ఏమిటంటే చిరంజీవికి ఆహ్వానం పంపిన ఇదే కిషన్ రెడ్డి నేరుగా ఆయన్నే ఆహ్వానించారు. మరి చంద్రబాబు దగ్గరకు వచ్చేసరికి మాత్రం పిలుపు ఎందుకు మారిపోయింది ? మిగిలిన పార్టీల్లో ఎన్నింటికి ఆహ్వానాలు అందినాయి, ఎంతమందిని రమ్మని ఆహ్వానించారనే విషయంలో క్లారిటిలేదు. ఇప్పటివరకు మిత్రపక్షం జనసేన అధినేతకు కూడా ఇన్విటేషన్ అందలేదని సమాచారం. తమ్ముడికి ఆహ్వానం అందలేదుకానీ అన్నయ్యకు మాత్రం ఇన్విటేషన్ పంపటం విచిత్రంగానే  ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: