రాజకీయాల్లో అనుకున్నది సాధించాలంటే రెండుమార్గాలున్నాయి. మొదటిదేమో జనాభిమానం పొంది అనుకున్నది సాధించటం. ఇక రెండోదేమో పవర్ సెంటర్ పక్కనే ఉంటు అదునుచూసి దెబ్బకొట్టి కుర్చీని లాగేసుకోవటం. నిజానికి రెండూ కష్టమే కానీ మ్యానేజ్మెంట్ స్కిల్స్ తెలిస్తే రెండో పద్దతిలో  టార్గెట్ తేలిగ్గా రీచ్చవచ్చు. ఇపుడిదంతా ఎందుకంటే మహారాష్ట్రలో మంత్రి, తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండే ఎంచుకున్న మార్గం రెండోది కావటమే.





ముఖ్యమంత్రి, శివసేన అధినేతకు పక్కనే నమ్మకంగా ఉంటు అదునుచూసి దెబ్బకొట్టారు. శివసేనకు చెందిన 55 మంది ఎంఎల్ఏల్లో సుమారు 40 మందిని లాగేసుకున్నారు. అలాగే 18 మంది ఎంపీల్లో 14 మందిని లాగేసుకున్నారని సమాచారం. వీళ్ళకి ఏక్ నాథ్ అంటే పడిచచ్చిపోయేంత అభిమానం ఏమీలేదు. కాకపోతే థాక్రే అంటే బాగా అసంతృప్తి కారణంగానే షిండేతో చేతులు కలిపారు. వీళ్ళ వెనుక ఎలాగూ బీజేపీ హస్తముందనే ప్రచారానికి కొదవలేదు.





ఇక్కడే అప్పుడెప్పుడో అంటే 1995లో ఏపీలో జరిగిన వెన్నుపోటు రాజకీయం గుర్తుకొస్తోంది. 1994 ఎన్నికల్లో టీడీపీని అఖండ మెజారిటితో అధికారంలోకి తీసుకొచ్చారు ఎన్టీయార్. సీఎం అయిన కొద్దినెలలకే చంద్రబాబు వెన్నుపోటు పొడిచేసి పార్టీని, ముఖ్యమంత్రి కుర్చీని లాగేసుకున్నారు. అప్పట్లో చంద్రబాబు మంత్రులు, ఎంఎల్ఏలను ఎలా లాగేసుకున్నారో ఇపుడు షిండే కూడా మంత్రులు, ఎంఎల్ఏలను లాగేసుకున్నారు.





అప్పుడు కూడా దాదాపు వారంరోజుల పాటు హైదరాబాద్ లోనే ఉన్న ఒక హోటల్లో క్యాంపు నడిచింది. అప్పుడు ప్రభుత్వం మొత్తం టీడీపీదే అయితే ఇప్పటి ప్రభుత్వం మూడుపార్టీల సంకీర్ణం. ఇదొక్కటి తప్ప మిగిలిందంతా సేమ్ టు సేమ్ అని అనుకోవచ్చు. షిండే ఎన్నికలకు వెళితే ఎవరూ ఓట్లేయకపోవచ్చు. వేరే పార్టీ పెట్టుకుని, జనాల దగ్గరకు వెళ్ళి ఓట్లేయించుకుని గెలవటం అవనవసరమని అనుకున్నారేమో అందుకనే ఏకంగా పార్టీని చీల్చేసి తమదే అసలైన శివసేనగా క్లైం చేసుకున్నారు. దీనికి బీజేపీ సంపూర్ణ మద్దతిస్తోంది. ఇక్కడే బీజేపీ తెలివిగా ఎత్తులేసింది. షిండేనే సీఎం కుర్చీలో కూర్చోబెట్టింది. మంత్రివర్గంలో కూడా పూర్తిగా షిండేవర్గం ఎంఎల్ఏలే ఉంటారు. బీజేపీ బయటనుండి మద్దతు మాత్రమే అందిస్తోంది.  ఎన్టీయార్ కు వెన్నుపోటుపొడిచి కుర్చీ కూర్చోవటంలో చంద్రబాబు సక్సెస్అయినట్లే ఇపుడు
బీజేపీ అండతో షిండే సీఎం కుర్చీలో కూర్చున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: