మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి శివసేన చీలికవర్గం+బీజేపీ ముగింపు పలికాయి. రెండుపార్టీల ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. శివసేన చీలికవర్గం నేత ఏక్ నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారంచేశారు. అలాగే మాజీముఖ్యమంత్రి, బీజేపీ సినియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. మంత్రివర్గంలో కూడా రెండుపార్టీల ఎంఎల్ఏలుండబోతున్నారు.  





సాయంత్రం శివసేన తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండేతో కలిసి మీడియాతో మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతు షిండేనే ముఖ్యమంత్రిగా ప్రకటించారు. పైగా మంత్రివర్గంలో కూడా బీజేపీ చేరబోవటంలేదని పూర్తిగా షిండేవర్గమే ఉంటుందని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే మూడుగంటల తర్వాత సమీకరణలు మారిపోయాయి. ప్రభుత్వంలో బీజేపీ కూడా చేరాలని నరేంద్రమోడి నిర్ణయించటంతో అదే విషయాన్ని దేవేండ్రకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చెప్పారు.






దాంతో మహారాష్ట్ర రాజకీయాల్లో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. అసలు మధ్యాహ్నం వరకు దేవేంద్రుడే సీఎంగా షిండే ఉపముఖ్యమంత్రిగా ప్రచారం జరిగింది. అలాంటిది సాయంత్రమయ్యేసరికి మారిపోయిన వ్యూహం రాత్రయ్యేసరికి పూర్తిగా తల్లకిందులైపోయింది.  ఇక్కడే బీజేపీ కక్కుర్తంతా బయటపడింది. దేవేంద్రకు బదులు మరో సీనియర్ నేతకు ఉపముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టుండే బాగుండేది. ఎందుకంటే గతంలోనే దేవేంద్ర ముఖ్యమంత్రిగా చేశారు. సీఎంగా పనిచేసిన దేవేంద్ర మళ్ళీపుడు ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేయటంలోనే ఈ సీనియర్ కూడా పదవి విషయంలో ఎంత కక్కుర్తిపడ్డారో అర్ధమైపోతోంది.






సాయంత్రంవరకు ప్రభుత్వంలో తాము చేరబోమని,  బయటనుండి మద్దతు మాత్రమే ఇస్తామని దేవేంద్ర ప్రకటిస్తే అంతా మెచ్చుకున్నారు. బీజేపీ మంచి వ్యూహంతోనే రాజకీయాలు చేస్తోందని అందరు అనుకున్నారు. అలాంటిది రాత్రయ్యేసరికి మొత్తం సీనంతా మారిపోవటమే అందరినీ ఆశ్చర్యపరిచింది. ఉపముఖ్యమంత్రి, మంత్రి పదవుల కోసం బీజేపీ ఇంతగా కక్కుర్తిపడుతుందని ఎవరు అనుకోలేదు. ఏదేమైనా బీజేపీ తీసుకున్న నిర్ణయం ఏమాత్రం హర్షించేట్లుగా లేదు. కేవలం శివసేన చీఫ్ ఉధ్థవ్ థాక్రే మీద కసితీర్చుకునేందుకు బీజేపీయే షిండేని రెచ్చగొట్టి సంకీర్ణప్రభుత్వాన్ని కూల్చేసిందన్న విషయం ఇపుడు ప్రచారమవుతోంది.




మరింత సమాచారం తెలుసుకోండి: