ఇపుడిదే విషయమై చర్చలు నడుస్తోంది. మొన్నటివరకు ఏదోపద్దతిలో బీజేపీతో పొత్తు కుదిరేందుకు అవకాశాలున్నాయనే తమ్ముళ్ళందరు అనుకుంటున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ద్వారా కమలంపార్టీతో పొత్తుకు ప్రయత్నించాలని ఆశపడ్డారు. అయితే తాజాగా జరిగిన పరిణామంతో చంద్రబాబునాయుడుతో పొత్తుకు బీజేపీ శాస్వతంగా తలుపులు మూసేసినట్లే అని అర్ధమవుతోంది.





ఇపుడున్నది వాజ్ పేయ్, అద్వానీ నాయకత్వంలోని బీజేపీ కాదని మోడి నేతృత్వంలోని బీజేపీ అని చంద్రబాబు మరచిపోయినట్లున్నారు. అందుకనే 2018 తర్వాత 2019 ఎన్నికల్లో చంద్రబాబు కేంద్రప్రభుత్వంతో పాటు వ్యక్తిగతంగా మోడీని నోటికొచ్చినట్లు మాట్లాడారు. అసెంబ్లీలో మోడీ భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాంతో చంద్రబాబు మీద మోడి బాగా మంటగా ఉన్నారని తేలిపోయింది. ఆదెబ్బ 2019 ఎన్నికల్లో స్పష్టంగా బయటపడింది.





మోడీ విషయంలో తానుచేసిన తప్పేంటో తెలుసుకున్న చంద్రబాబు బహిరంగంగానే తర్వాత చెంపలేసుకున్నా మోడీ మెత్తబడలేదు. పైగా ఇంకా ఇంకా దూరం పెడుతునే ఉన్నారు. 4వ తేదీన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు మోడీ భీమవరం వస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు ఆహ్వానాన్ని పంపిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అందులో టీడీపీ తరపున ఎవరినైనా ప్రతినిధిని పంపమని చెప్పారంటే ఇంతకుమించిన అవమానం ఇంకేముంటుంది.





ఆహ్వానంపంపటంతో ఆగకుండా ఫోన్ కూడా చేశారు. ఫోన్లో  చంద్రబాబును రావద్దని చెప్పిన కిషన్ రెడ్డి ప్రతినిధిని మాత్రం పంపాలని కోరారట. చంద్రబాబును రావద్దని కోరారంటే అర్ధమేంటి ? ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ మొహాన్ని మోడి చూడదలచుకులోదేని తెలిసిపోతోంది. ఈ నేపధ్యంలోనే వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తుకు టీడీపీకి తలుపులు మూసుకుపోయినట్లే అనుకోవాలి.






బీజేపీ లేకుండా జనసేన పొత్తుకు వచ్చినా టీడీపీకి పెద్ద ఉపయోగముండదు. ఉపయోగం సంగతి పక్కనపెట్టేస్తే కష్టాలు మొదలైనా ఆశ్చర్యపోవక్కర్లేదు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా జనాలందరికీ తేటతెల్లమైన విషయం ఇదే. ఇదే సమయంలో బీజేపీ అగ్రనేతల ముందు పవన్ స్ధాయిఏమిటో ఇప్పటికే తేలిపోయింది. కాబట్టి మోడీ ఆలోచనలేమిటో ఇంత స్పష్టంగా తెలిసిపోయిన తర్వాత పవన్ కూడా టీడీపీతో పొత్తు విషయాన్ని మోడీ ముందు ప్రస్తావించే సాహసం చేయకపోవచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: