ఇక ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉందని కేంద్రం తెలిపింది. పూర్తి స్థాయి సర్వే ఆధారంగా వరుసగా రెండో ఏడాది ర్యాంకుల ప్రకటన చేయడం జరిగింది.ఇక 97.89శాతంతో ఈ సర్వేలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలవగా,అలాగే 97.77 శాతంతో గుజరాత్ రెండో స్థానంలో నిలిచింది.మొత్తం 15 రంగాలకు సంబంధించి 301 సంస్కరణల ఆధారంగా ర్యాంకులను నిర్థారించారని తెలుస్తోంది. ఈ ఏడాది నుంచి టాప్ అఛీవర్స్, అఛీవర్స్ ఇంకా ఎమర్జింగ్ బిజినెస్ ఎకో సిస్టమ్స్ గా ప్రకటిస్తున్నారు.దీంతో ఏపీ పారిశ్రామిక వర్గాలు ఇంకా ప్రభుత్వ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నాయి.ఇక కరోనా మహమ్మారి ప్రబలిన నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల రీత్యా పారిశ్రామిక ప్రగతి వెనుకబడిపోతుందని ఆందోళన చెందినా కూడా తమ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి తీసుకున్న చర్యలు కారణంగా ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో అగ్ర స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. కేంద్రం ప్రకటించిన ఈ జాబితాలో టాప్ అఛీవర్స్ గా ఏడు రాష్ట్రాలు నిలిచాయి. వాటిలో ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్, తమిళనాడు, తెలంగాణ, హరియాణా, పంజాబ్ ఇంకా అలాగే కర్ణాటక ఉన్నాయి.ఇంకా ఈ సర్వేలో 92 శాతం దాటిన రాష్ట్రాలను టాప్ అఛీవర్స్ గా ప్రకటించింది.


ఇక పెట్టుబడులను రప్పించడంలో అదేవిధంగా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడంలో ఆంధ్రా కన్నా కూడా తెలంగాణ కాస్త వెనుకబడి ఉంది. కేంద్రం చెప్పిన విధంగా పారిశ్రామిక సంస్కరణల అమలుకు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు బాగున్నాయి అని కేంద్రం కితాబు కూడా ఇస్తోంది. రాష్ట్రంలో పరిశ్రమలకు ఊతమిచ్చే విధంగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఫలితాలు ఇస్తున్నాయి అని సర్వేలో కూడా నిర్థారించింది.ఇక రాష్ట్రంలో ఏర్పాటైన పరిశ్రమలకు చేయూతనిచ్చే విధంగా పలు సంస్కరణలను ఎప్పటికప్పుడు చేపట్టడంపై ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ (ఫ్యాప్సీ) ఆనందం వ్యక్తం చేస్తోంది. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమయిన అనుమతులను త్వరితగతిన ఇవ్వడం ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘనత సాధించిందని చెబుతోంది. ఇక దీని వల్ల రాష్ట్రం తయారీ రంగంలో (మ్యానుఫ్యాక్చరింగ్ ఫీల్డ్) కొత్త పెట్టుబడులను ఆకర్షించేందుకు వీలుంటుందని కూడా అంటోంది. తద్వారా పారిశ్రామిక వాతావరణం చాలా బాగా మెరుగవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: