ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాదులో పర్యటనకు సిద్ధమయ్యారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక మోడీ పర్యటన ఎంతో ఆసక్తిని సంతరించుకుంది. అయితే ప్రధాని నరేంద్ర నరేంద్ర మోడీ హైదరాబాద్లో పర్యటిస్తూ ఉండడంపై అటు ప్రతిపక్ష విపక్ష పార్టీలు మాత్రం  విమర్శలు చేస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. తెలంగాణకు ఏం చేశారని మోదీ హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారు అంటూ అధికార టీఆర్ఎస్ పార్టీ విమర్శలు గుప్పిస్తూ ఉండగా.. అటు కాంగ్రెస్ నేతలు సైతం అదే రీతిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇక ఇలాంటి సమయంలోనే సిపిఎం పార్టీ నేతలు కూడా మోడీపై విమర్శలు గుప్పించారు.


 ఇక ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో భాగంగా సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి కె నారాయణ మోడీపై ప్రశ్నలు సంధించారు. తక్కువ స్థానాల్లో గెలిచినప్పటికీ ప్రభుత్వాలను కొల్లగొట్టి ఎనిమిది రాష్ట్రాలలో కూడా ప్రజాస్వామ్యాన్ని హత్య చేసిన మోదీ ఇక ఇప్పుడు హైదరాబాద్ వస్తున్నారు.. ఆయన తీరును బీజేపీ సమర్థిస్తుందా అంటూ ప్రశ్నించారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు కుళచేస్తున్న నేపథ్యంలో ఫెడరల్ పూర్తి తమకు అస్సలు ఇష్టం లేదు అంటూ బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేయాలని వ్యాఖ్యానించారు.


 మోడీ హయాంలోనే  బడాబాబులు 25 మంది 25 లక్షల కోట్లు ఎగ్గొట్టి చివరికి విదేశాలకు పారిపోయారని విమర్శలు గుప్పించారు నారాయణ. గత ప్రభుత్వాలు అధికారంలో ఉన్న సమయంలో 40 లక్షల కోట్ల అప్పు చేస్తే ఇక మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఆ అప్పు 85 లక్షల కోట్లకు చేరింది అంటూ ఎద్దేవా చేశారు. మోదీ చర్యలు అన్నింటినీ కూడా భాజపా ఆమోదిస్తుందా అంటూ నిలదీశారు నారాయణ. ఇక గతంలో ఏ ప్రధాని మేకప్ కోసం నెలకు 70 లక్షలు ఖర్చు చేయడం చూడలేదని సెటైర్ వేశారు. మోదీ తనను తాను సన్యాసిగా పేర్కొంటూనే విలాసాలకు ప్రజల సొమ్ము లక్షలు ఖర్చు పెట్టుకుంటున్నాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు నారాయణ.

మరింత సమాచారం తెలుసుకోండి: