కొద్దిరోజులుగా ఇటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అటు తెలుగుదేశంపార్టీ నేతలు పొత్తుల విషయంలో పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే పొత్తుండి తీరాలని వేర్వేరు వేదికలపై చంద్రబాబు, పవన్ పదే పదే చెప్పారు. జగన్ విషయంలో ఇద్దరిమధ్య ఏకాభిప్రాయం వచ్చిన కారణంగానే పొత్తుకు ఇద్దరూ రెడీ అంటే రెడీ అనుకున్నారు. అయితే తెరవెనుక ఏమైందో ఏమో హఠాత్తుగా పవన్ మూడూ ఆప్షన్లివ్వటం దాన్ని టీడీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించటం అందరు చూసిందే.






అయితే రెండుపార్టీల్లోని నేతల సమాచారం ప్రకారం ఎన్నికలముందు పొత్తుకన్నా తర్వాత పొత్తు పెట్టుకుంటేనే మంచిదని చంద్రబాబు, పవన్ ఆలోచిస్తున్నారట. ఎందుకంటే ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకుంటే రెండుపార్టీల మధ్య ఓట్ల షేరింగ్ కచ్చితంగా జరుగుతుందనే నమ్మకంలేదట. అలాగే చాలా నియోజకవర్గాల్లో రెండుపార్టీల్లోని నేతల నుండి విడివిడిగా పోటీచేస్తేనే బాగుంటుందనే ఫీడ్ బ్యాక్ వస్తోందట.






ఎన్నికలకు ముందే పొత్తుపెట్టుకుంటే కమ్మ-కాపు మధ్య ఓట్ల ట్రాన్స్ ఫర్ జరగకపోతే ఇద్దరం నష్టపోతామనే ఆలోచన మొదలైందట. ఈ కారణంగానే ఎవరికి వారుగా పోటీచేస్తేనే ఉపయోగముంటుందని కొన్నినియోజకవర్గాల్లోని నేతల అభిప్రాయసేకరణలో బయటపడిందట. ఈ పద్దతి బాగానే ఉంటుందని చంద్రబాబు, పవన్ కూడా అనుకుంటున్నట్లు సమాచారం. మరపుడు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లలో చీలిక రానివ్వనని పవన్ చేసిన భీషణ ప్రతిజ్ఞ ఏమవుతుందో ?






గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర జనసేన నేతల్లో చాలామంది టీడీపీతో పొత్తు వద్దని స్పష్టంగా చెబుతున్నారట. పొత్తువల్ల జనసేన నష్టపోతుంది కాబట్టే సొంతంగా పోటీచేయాలని సూచించారట. ఇందులో భాగంగానే టీడీపీ సీనియర్ నేతలు కూడా టీడీపీ ఒంటరిగా పోటీచేస్తే 160 సీట్లలో గెలుస్తుందని పదే పదే చెబుతున్నది. రెండుపార్టీలు పొత్తులు పెట్టుకుంటే లాభపడతాయా ? వేర్వేరుగా పోటీచేస్తేనే లాభపడతాయా ? అన్నది వెయిట్ చేసి చూడాల్సిందే. ఎవరెలా వచ్చినా అధికారం మాత్రం తమదే అని జగన్ అంటున్నారు. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.





మరింత సమాచారం తెలుసుకోండి: