ఇపుడిదే విషయమై పార్టీతో పాటు మామూలు జనాల్లో కూడా చర్చలు మొదలయ్యాయి. ఇంతకీ విషయం ఏమిటంటే నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ ఉపఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే కదా. గెలుస్తుందని అందరికీ ముందే తెలుసుకానీ ఓటుషేర్ ఇంతగా పెరుగుతుందని మాత్రం ఎవరు ఊహించలేదు. 2019లో మేకపాటి గౌతమ్ రెడ్డి గెలిచినపుడు వైసీపీకి వచ్చిన ఓటుషేర్ 52 శాతం మాత్రమే.





ఇపుడు ఆయన సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డి కి వచ్చిన ఓటుషేర్ 72 శాతం. ఉపఎన్నిక జరిగినపుడు అధికారపార్టీ అభ్యర్ధి గెలవటం, మంచి మెజారిటి రావటం మామూలు విషయమే. కానీ ఓటుషేర్ ఈ స్ధాయిలో పెరగటం మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. పైగా ఉపఎన్నిక చాలా పకడ్బందీగా, ఎలాంటి గొడవలు, అక్రమాలు లేకుండా జరిగిందని స్వయంగా ఎల్లోమీడియానే చెప్పింది. సరిగ్గా ఈ విషయంపైనే చంద్రబాబునాయుడు కూడా నేతలతో జరిగిన సమీక్షలో ప్రస్తావించారట.





వైసీపీకి 20 శాతం ఓటుషేర్ పెరగటాన్ని ఏ విధంగా చూడాలో చెప్పమని తమ్ముళ్ళని అడిగారట. ఒకవైపు జనాలంతా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి బాగా వ్యతిరేకంగా ఉన్నారని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాదుడేబాదుడు కార్యక్రమానికి జనాలు బాగా వస్తున్నారు. మహానాడు బహిరంగసభ బ్రహ్మాండంగా జరిగిందని సంతోషపడిపోతున్నారు. తన రోడ్డుషోలకు, సభలకు వస్తున్న జనాలను చూసి ఇంకేముంది ఎన్నికలు ఎప్పుడు జరిగినా జగన్ ఓడిపోవటం తాను సీఎంగా బాధ్యతలు తీసుకోవటమే ఆలస్యం అన్నట్లుగా ఉన్నారు చంద్రబాబు.





ఇలాంటి నేపధ్యంలోనే జనాలు వైసీపీ ఓటుషేర్ పెంచటాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు. జనాలు తన సభలకు వస్తున్నారు కానీ ఓట్లుమాత్రం వైసీపీకే వేస్తున్న విషయం అర్ధమైంది. ఇపుడే కాదు తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక, బద్వేలు అసెంబ్లీ ఉపఎన్నికలో కూడా వైసీపీ ఓటుషేర్ పెరిగింది. ఎల్లోమీడియా ఎంతగా వ్యతిరేక ప్రచారం చేస్తున్నా జనాల్లో మాత్రం తాను అనుకున్నట్లు వ్యతిరేకత కనబడలేదనే విషయం చంద్రబాబుకు అర్ధమైపోయింది. మరీ పరిస్ధితులు ఏమిచేయాలో చంద్రబాబుకు పాపం దిక్కుతోచటం లేదట.



మరింత సమాచారం తెలుసుకోండి: