జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇంతకాలం నడిచిన రూటు సరిగా లేదని అర్ధమైపోయింది. మరి పార్టీ రాత మారాలంటే ఏమిచేయాలి ? ఏమిచేయాలంటే అర్జంటుగా రూటు మార్చాల్సిందే. ఇంతకీ రూటేమిటి ? రాతేమిటి ? అనుకుంటున్నారా ? జనసేనకు జనాల్లో నమ్మకం పెరగాలంటే, జనాభిమానం పెరగాలంటే పవన్ తన పాలసీని మార్చుకోవాలి. ఇప్పటివరకు యాంటీ జగన్మోహన్ రెడ్డి అనే రూటులో మాత్రమే పవన్ వెళుతున్నారు. ఇదంతగా వర్కవుటుకాలేదని అర్ధమైపోయింది.





పవన్ రాజకీయం చూస్తే రాజకీయాల్లోకి వచ్చింది కేవలం జగన్ను వ్యతిరేకించటానికి మాత్రమే అని చెప్పినట్లయ్యింది. అయితే జనాలు తనను నమ్మాలంటే జగన్ను వ్యతిరేకించినంత మాత్రాన సరిపోతుందా ? జగన్ను ఒక్క పవనే కాదు టీడీపీ, వామపక్షాలు, బీజేపీ, కాంగ్రెస్ కూడా వ్యతిరేకిస్తున్నాయి. అంటే యాంటీ జగన్ ఓట్ల కోసం ఇన్నిపార్టీలు ప్రయత్నిస్తున్నాయి. మరపుడు పవన్ ఏమిచేయాలి ? జనాల్లో అభిమానం సాందించుకోవాలంటే, నమ్మకాన్ని పెంచుకోవాలంటే పాజిటివ్ పాలిటిక్స్ చేయాలి.





పాజిటివ్ పాలిటిక్స్ అంటే రాష్ట్రానికి అన్యాయం చేసిన, చేస్తున్న అన్నీపార్టీలను పవన్ దూరంగా పెట్టాల్సిందే. అంటే ఇంకా స్పష్టంగా చెప్పాలంటే జగన్+చంద్రబాబు+బీజేపీని పూర్తిస్ధాయిలో వ్యతిరేకించినపుడే జనాలు పవన్ వైపు చూస్తారు. ఎందుకంటే 2014-19 మధ్య రాష్ట్రాన్ని చంద్రబాబు+బీజేపీ నాశనం చేసేశాయి. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ కూడా రాష్ట్రాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నారని కదా పవన్ అంటున్నారు. ఈ మాట నిజమే అనుకుంటే మరందరినీ కలిపి పవన్ వ్యతిరేకించాల్సిందే.





పవన్ ఈపని చేస్తేనే జనాలు శభాష్ పవన్ అంటారు. అప్పుడు మెల్లిగా పవన్ వైపు జనాలు ఆకర్షితులవుతారు. అంతేకానీ రాష్ట్రాన్ని దెబ్బకొట్టిన చంద్రబాబు, బీజేపీని పల్లెత్తుమాట అనకుండా కేవలం జగన్ను మాత్రమే టార్గెట్ చేస్తానంటే పవన్ను ఎవరు పట్టించుకోరు. కాబట్టి పార్టీ రాతమారాలంటే పవన్ రూటు మార్చాల్సిందే. లేకపోతే ఖాళీ దొరికినపుడల్లా జగన్ పై బురదచల్లుతు తృప్తిపడాల్సిందే తప్ప ఇంకేమీ ఉపయోగం ఉండదు. వచ్చే ఎన్నికల తర్వాత మళ్ళీ ఐదేళ్ళు వెయిట్ చేసేంత ఓపిక పవన్ కుందా అన్నదే సందేహం.

మరింత సమాచారం తెలుసుకోండి: