తగిన సమయం కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెయిట్ చేస్తున్నట్లున్నారా ? తాజా వ్యాఖ్యలు విన్నతర్వాత ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. పార్టీ ఆఫీసులో వీరమహిళలను ఉద్దేశించి మాట్లాడుతు కులాలు, మతాల ప్రస్తావనలేని రాజకీయాలు రావాలని కోరుకున్నారు. ప్రస్తుత రాజకీయాల్లో పవన్ కోరిక సాధ్యంకాదని అందరికీ తెలిసిందే. కుల, మత ప్రస్తావన లేని రాజకీయాలను జనాలు ఏమాత్రం ఊహించలేరు.






ఇక్కడ విచిత్రం ఏమిటంటే తన మిత్రపక్షమైన బీజేపీ ఎదుగుదల కేవలం మతంపై మాత్రమే ఆధారపడుందన్న విషయం పవన్ కు తెలీదా ? మతంలేని రాజకీయాలను బీజేపీ ఏమాత్రం ఊహించలేందు. ఎందుకంటే మతరాజకీయాలు చేయకపోతే బీజేపీకి బతుకేలేదు. అవసరమైతే బీజేపీ పవన్ను అయినా వదిలేసుకుంటుంది కానీ మతాన్ని మాత్రం దూరంపెట్టదు. ఇలాంటి నేపధ్యంలో మత ప్రస్తావన లేని రాజకీయాలు రావాలని పవన్ కోరుకోవటంలో అర్ధమేంటి ?






తాజా వ్యాఖ్యలను చూసిన తర్వాత బీజేపీతో దూరమవ్వటానికే పవన్ డిసైడ్ అయినట్లు అర్ధమైపోతోంది. కాకపోతే సరైన సమయంకోసం వెయిట్ చేస్తున్నట్లున్నారు. ఒకవైపు మతతత్వపార్టీతో పొత్తు పెట్టుకుని మరోవైపు మత ప్రస్తావన లేని రాజకీయాలు రావాలని చెప్పటంలోనే పవన్ అజ్ఞానం బయటపడింది. ఇప్పటికిప్పుడు బీజేపీతో విడిపోతే ఎదురయ్యే కష్టనష్టాలు ఏమిటో పవన్ కు బాగా తెలుసు. అందుకనే మరికొంత కాలం వెయిట్ చేయకతప్పదు.






పరిస్ధితులన్నీ కలిసొస్తే 2023లో ఏదోరోజు సడెన్ గా బీజేపీని పవన్ గుడ్ బై చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏదన్నా సందర్భం వస్తే  పవన్ను బీజేపీ వదిలేయాల్సిందే కానీ బీజేపీని పవన్ వదిలే అవకాశాలు ఈలోపు లేవన్నది స్పష్టం. ఆ సమయం వచ్చేవరకు బీజేపీని పవన్ మోయాల్సిందే కానీ వేరేదారిలేదు. బహుశా వచ్చే ఎన్నికల్లోపు ఆ అవకాశం రాకపోతుందా అని  పవన్ వెయిట్ చేస్తున్నారేమో. ఒకవేళ అవకాశం రాకపోతే చేయగలిగేదేమీ లేదు. మతతత్వపార్టీతోనే ఎన్నికలకు వెళ్ళి లాభమో, నష్టమో తేల్చుకోవాల్సిందే తప్ప గత్యంతరం లేదంతే.



మరింత సమాచారం తెలుసుకోండి: