మోదీ తెలంగాణ పర్యటన లో భాగంగా హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో సభను ఏర్పాటు చేశారు.అక్కడకు వచ్చిన జనాన్ని చూసి ప్రధానమంత్రి నరేంద్రమోదీ చాలా హ్యాపీగా ఫీలైనట్టు కనిపిస్తోంది. ఎందుకంటే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల తరువాత జరిగిన ఈ విజయ సంకల్ప సభను చూసి ఎలాగైనా సరే భారీగా సక్సెస్ చేయాలని బీజేపీ నేతలు చాలా రోజుల నుంచి ఓ వ్యూహంతో కష్టపడ్డారు..మొత్తానికి మోదీని ఆనందింప చేశారు..ఈ సమావెసానికి పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
ఈ క్రమంలో ఈ సభకు సభకు ప్రజా గాయకుడు గద్దర్ హాజరయ్యారు.



ప్రధాని మోదీ ప్రసంగం ముగిసే వరకు అక్కడే ఉన్నారు. ప్రధాని మోదీ ప్రసంగం మొత్తం పరిశీలన గా విన్నారు.సభ ముగిసిన తర్వాత మీడియా తో ఆయన మాట్లాడుతూ.. మోదీ ఎవరిపైన పర్సనల్ వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. కేవలం ప్రధాని ప్రసంగం వినేందుకే వచ్చాను.. ప్రధాన మంత్రి చాలా కాలం తర్వాత కేవలం ఫిలాసఫీ మీద మాట్లాడరు. ఒక తత్త్వవేత్త.. బీజేపీ భావవాదం నుంచి వేరుగా.. డెమొక్రటిక్‌ గా మాట్లాడుతున్నారా లేదా అని ప్రధాని మోదీ ప్రసంగం వినడం జరిగిందన్నారు.


ఇదిలావుంటే.. బీజేపీ శ్రేణులు ప్రతిష్టాత్మకం గా నిర్వహిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ సభా ప్రాంగణానికి గద్దర్ రావడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. మధ్యాహ్నం మూడు గంటల సమయం లో గద్దర్ పెరేడ్ గ్రౌండ్ కు రావడం బీజేపీ శ్రేణులనే ఆశ్చర్యపరుచ గా.. రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. గతంలో రాహుల్ గాంధీ ప్రతిపక్షాల సభకు హాజరైన గద్దర్ ఇవాళ మోడీ సభ కు హాజరుకావడం గమనార్హం.. మొత్తానికి గద్దర్ ఏ పార్టీకి మద్దతు తెలుపుతారు అన్నది చర్చనీయాంశం గా మారింది..నేటి తో మోదీ తెలంగాణ పర్యటన కూడా పూర్తీ అయ్యింది. మోడీ కోసం వండిన తెలంగాణ వంటలు బాగా మెప్పించాయి..



మరింత సమాచారం తెలుసుకోండి: