అందరిలోను ఇపుడిదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎప్పుడైతే మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను పక్కన పెట్టేసి మెగాస్టార్ చిరంజీవికి అధిక ప్రాధాన్యత ఇస్తోందో అప్పటినుండే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తాజాగా భీమవరంలో మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో చిరంజీవికి బీజేపీ బాగా ప్రధాన్యత ఇచ్చిన విషయం అందరు చూసిందే. 125వ జయంతి సందర్భంగా అల్లూరి విగ్రహాన్ని నరేంద్రమోడి ఆవిష్కరించిన విషయం తెలిసిందే.





ఈ సందర్భంగా భీమవరంలో జరిగిన కార్యక్రమంలో వేదిక మీద చిరంజీవి కూడా ఉన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, మంత్రులు దాడిశెట్టి రాజా, రోజా వేదికమీద ఉన్నారంటే అర్ధముంది. మరి ఏ హోదాలో చిరంజీవిని వేదికమీద కూర్చోబెట్టారు ? ప్రత్యేకించి చిరంజీవిని కిషన్ రెడ్డి భీమవరానికి ఆహ్వానించారు. ఇంత ప్రత్యేకంగా చిరింజీవిని ఆహ్వానించాల్సిన అవసరం కిషన్ కు ఏముంది ? మెగాస్టార్ ఏమీ ఇపుడు రాజకీయాల్లో లేరు.





అయితే జనాల్లో అభిమానం మాత్రం అలాగే ఉంది. చిరంజీవికి ఉన్నంత స్ధాయిలోనే తమ్ముడు పవన్ కు కూడా విశేషమైన అభిమానులున్నారు. ఈ విషయం కిషన్ కు బాగా తెలుసు. అయినా పవన్ను కాదని ప్రత్యేకంగా చిరంజీవిని మాత్రమే పిలిచారంటే తెరవెనుక ఏదో మొదలైందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారని ఎవరు అనుకోవటంలేదు. మరలాంటపుడు ఎందుకని చిరంజీవికి ఇంత ప్రాధాన్యతిచ్చారు ?






కాపుల ఓట్లకోసమే ఇంత ప్రాధాన్యత ఇచ్చారా అనే అనుమానాలు పెరుగుతున్నాయి. కాపుల్లో చిరంజీవికి పట్టుంది. కాపుల ఓట్లు తేవటంలో పవన్ లాభంలేదని అనుకుంటున్నారా ? లేకపోతే ఏదోరోజు తమతో పవన్ గుడ్ బై చెప్పటం ఖాయమని అనుమానిస్తున్నారా ? ఇదే జరిగితే కాపుల ఓట్లకోసం ఉపయోగపడతారని చిరంజీవికి బాగా ప్రదాన్యత ఇస్తున్నట్లున్నది బీజేపీ.  అంటే ఓట్ల వేటలో తమ్ముడికన్నా చిరంజీవే బెటరని బీజేపీ డిసైడ్ అయినట్లుంది. అందుకనే భీమవరం కార్యక్రమానికి పవన్ను కాదని చిరంజీవిని ప్రత్యేకంగా పిలిచింది. మరి చిరంజీవి బీజేపీ గాలానికి తగులుకుంటారా ?

మరింత సమాచారం తెలుసుకోండి: