మొత్తానికి కొద్దిరోజులుగా ఉత్కంఠ రేపిన నరసాపురం వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు మిడిల్ డ్రాపయ్యారు. ఢిల్లీనుండి హైదరాబాద్ కు చేరుకుని భీమవరంకు రైలులో బయలుదేరిన ఎంపీ మధ్యలోనే దిగేసి మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోయారు. ఇందుకనే ఎంపీ మిడిల్ డ్రాప్ అయ్యారని అంటున్నది. ఇంతకీ ఎంపీ వెనక్కు దిరగాల్సిన అవసరం ఏమొచ్చింది ? ఏమొచ్చిందంటే చిన్న లాజిక్ మిస్సవ్వటంతోనే నరేంద్రమోడి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎంట్రి దొరకలేదు.





ఎప్పుడైతే మోడి కార్యక్రమానికి నో ఎంట్రి బోర్డు పడిపోయిందో చేసేదిలేక తిరిగి వెళ్ళిపోయారు. ఇంతకీ విషయం ఏమిటంటే అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా కాంస్య విగ్రహం  ఏర్పాటు+ఉత్సవాలు మొదలయ్యాయి. భీమవరంలో ఏర్పాటైన విగ్రహాన్ని నరేంద్రమోడి ఆవిష్కరించారు. తన పార్లమెంటు నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమం కాబట్టి ఎంపీ హాజరవ్వాలని అనుకున్నారు. అయితే మామూలుగా జరిగిపోయే కార్యక్రమాన్ని ఎంపీ కావాలనే కెలుక్కుని పెద్దదిగా చేసుకున్నారు.





అనవసరంగా జగన్మోహన్ రెడ్డిపై బురదచల్లేసి ఏదో సాదిద్ధామని అనుకున్నారు. దాదాపు వారంరోజులుగా రచ్చరచ్చచేసి కోర్టులో కేసులు వేసి వ్యవహారాన్ని కంపుచేసేశారు. అయితే ఎంపీ వేసిన అన్నీ కేసులను కోర్టు కొట్టేసిందిలేండి. అయినా సరే సభకు వచ్చి తీరుతానని, ఎలా ఆపుతారో చూస్తానంటు చాలెంజ్ చేశారు. తనను అరెస్టుచేస్తే రాష్ట్రంలో పెద్ద తిరుగుబాటే మొదలవుతుందని వార్నింగ్ ఇచ్చారు. తీరాచూస్తే ఎవరు ఆపకుండానే తనంతట తానే వెనక్కు వెళ్ళిపోయారు.





కారణం ఏమిటంటే ప్రధానమంత్రి కార్యక్రమంలో  పాల్గొనే ప్రముఖల జాబితాలో అసలు ఎంపీ పేరేలేదట. ప్రధాని పాల్గొనే కార్యక్రమాల్లో ఎవరెవరు పాల్గొనాలనే జాబితాను పీఎంవోనే తయారుచేస్తుంది. దాని ప్రకారమే ఎస్పీజీ వేదికమీదకు అనుమతిస్తుంది. ఆ జాబితాలో తన పేరులేదని ఎంపీకి ఆదివారం రాత్రెప్పుడో తెలిసింది. చివరినిముషంలో జాబితాలో పేరు చేర్చే అవకాశంలేదు. దాంతో చేసేదిలేక ఎంపీ మిడిల్ డ్రాపైపోయి వెనక్కువెళ్ళిపోయారు. మోడీ కార్యక్రమంలో పాల్గొనటాన్ని చాలెంజ్ గా తీసుకున్న ఎంపీ పీఎంవోతో మాట్లాడి జాబితాలో తనపేరు ఉండేట్లు చూసుకోవక్కర్లేదా ? ఈ లాజిక్కును ఎంపీ ఎలా మిస్సయ్యారబ్బా ?

మరింత సమాచారం తెలుసుకోండి: