నేటి ఆధునిక సమాజం లో మనిషి జీవన శైలిలో ఎన్నో మార్పులు వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే మనిషి ఆలోచనా విధానం లో కూడా ఈ మార్పు స్పష్టం గా కనిపిస్తుంది. అయితే ఒకప్పుడు మగవారి గా పుట్టి నప్పటికీ ఆడవారి లక్షణాలు ఉన్నవారు ఇక తమ లో ఉన్న ఆలోచనలు బయట పెట్టేందుకు  భయపడే వారు. ఎందుకంటే తమ గురించి బయటి సమాజానికి తెలిస్తే అందరూ చులకనగా చూస్తారనే ఎంతగానో ఆందోళన చెందేవారు. కానీ నేటి రోజుల్లో మాత్రం  ఇలాంటివి ఎక్కడా కనిపించడం లేదు అన్న విషయం తెలిసిందే. సభ్య సమాజం ఏమనుకున్నా పర్వాలేదు మనం హ్యాపీగా ఉన్నామా.. జీవితాన్ని ఎంతో సంతోషం గా ఆస్వాదిస్తున్నామా లేదా అన్నదే ముఖ్యం అనుకుంటూ ఎంతో మంది అందరికీ షాక్ ఇస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఇటీవలి కాలం లో గె జంటలు వివాహాలు చేసుకోవడం రోజు రోజుకు పెరిగి పోతూనే ఉంది. ఏకంగా ఇద్దరు పురుషులు పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇస్తున్నారు. సరిగ్గా కొన్ని నెలల క్రితం హైదరాబాద్ లో ఇలాగే ఇద్దరు పురుషులు పెళ్లి చేసుకున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఇలాంటి ఒక గే మ్యారేజ్ జరిగింది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఇద్దరు పురుషులు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. సభ్యసమాజం ఏమనుకుంటుంది అన్న విషయాన్ని పట్టించుకోలేదు. చివరికి ఇద్దరు పురుషులు వారి ప్రేమ బంధానికి పెళ్లి అనే ప్రమోషన్ ఇచ్చేశారు. ఇటీవల ఇద్దరు పురుషులు పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. అభిషేక్ రే, చైతన్య శర్మ ఇద్దరు యువకులు కుటుంబ సభ్యులు బంధువుల సమక్షంలో దండలు మార్చుకున్నారని తెలుస్తోంది. ఇక అంతకు ముందు ఇక బంధుమిత్రులందరికీ సమక్షంలో ఎంతో ఘనంగా మంగళస్నానం ఫంక్షన్ కూడా చేసుకున్నారు. వీరికి బంధువులు అందరూ ఆశీర్వచనాలు అందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Gey