ప్రస్తుతం అత్యంత ఎక్కువ జనాభా కలిగిన దేశాలలో భారత మొదటి స్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే . ప్రస్తుతం భారత జనాభా 130 కోట్లు ఉండవచ్చు అని అంచనా వేస్తున్నారు. ఇక ఇలాంటి భారత్ లో కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత మారణహోమం జరుగుతుందని అందరూ భావించారు. కానీ కేంద్ర ప్రభుత్వంతో పాటు  రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో తక్కువ నష్టంతోనే కరోనా వైరస్ నుంచి బయటపడింది భారత్. ఇలాంటి సమయంలోనే భారత్ వ్యాక్సిన్ కోసం ఇతర దేశాలపై ఆధారపడే పరిస్థితి వస్తుందని అనుకున్నప్పటికీ సొంతంగా వ్యాక్సిన్ తయారు చేసుకుని అగ్ర దేశాలకు షాక్ ఇచ్చింది.


 అంతేకాదు ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందించి ఎన్నో దేశాలకు ఆదర్శంగా నిలిచింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్ తీసుకుంటూ కరోనా వైరస్ నుంచి తమను తాము రక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. కొంత మంది ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుని ఉంటే మరికొంతమంది బూస్టర్ డోసు కూడా తీసుకునీ ఉన్నారు. అయితే కేవలం వ్యాక్సిన్ ఇవ్వడమే నిమిషాల వ్యవధిలోనే వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ కూడా ఇస్తూ ఉంది భారత ప్రభుత్వం. ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ మీద అటు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.


 కరోనా వైరస్ ను కూడా మోడీ ప్రభుత్వం రాజకీయంగా వాడుకుంటోందని.. అందుకే వైరస్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ పై  మోదీ బొమ్మ వేస్తున్నారు అంటూ గత కొన్ని రోజుల నుంచి విమర్శలు చేస్తున్నారనే విషయం తెలిసిందే. ఇటీవల ఇదే విషయంపై స్పందించినా నరేంద్ర మోడీ వ్యాక్సిన్ తీసుకున్నవారికి వెంటనే సర్టిఫికెట్ ఇస్తున్న భారత్ ను చూసి ప్రపంచమే చర్చించుకుంటూ ఉంది. కానీ కొంతమంది వ్యక్తులు మాత్రం వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ పై ఉన్న నా ఫోటో గురించి రాద్ధాంతం  చేస్తున్నారు అంటూ విమర్శలు చేస్తున్న వారికి కౌంటర్ ఇచ్చారు. భారత్ ఏకంగా ప్రపంచానికే వ్యాక్సిన్ అందించింది అంటూ మోడీ స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: