ఏపీ రాజకీయాలలో మార్పులు జోరుగా చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు జరుగుతున్న మార్పులు చూస్తుంటే రాబోయే ఎన్నికలు ఎంత ఉత్కంఠగా మారుతాయి అన్నది తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్నది జగన్ నేతృత్వంలోని వైసీపీ. గత ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే రాష్ట్రము మాత్రం అంత బాగా అభివృద్ధి చెందడం లేదన్నది కాదనలేని వాస్తవం. వచ్చే ఎన్నికలలో వైసీపీకి పోటీ భారీగా ఉండబోతున్నది అని మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీ టీడీపీ మరియు జనసేనలు తెరవెనుక రాజకీయాలను జోరుగా నడుపుతున్నారు. కానీ అధికారికంగా మాత్రం ఇంకా వీరిద్దరూ కలిసి పోటీ చేయనున్నది మాత్రం చెప్పలేదు.

కానీ పవన్ మాత్రం బీజేపీని వదిలేసి టీడీపీ తో కలవాలనే ప్లాన్ లో ఉన్నట్లు వార్తలు వినపడుతున్నాయి. ఇందుకు బలమైన కారణం కూడా ఉందట. ఇటీవల భీమవరం లో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలో భాగంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ వచ్చారు. అయితే ఈ కార్యక్రమానికి అతిధిగా మాజీ రాజ్యసభ సభ్యుడు మరియు సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి కూడా వచ్చాడు. అయితే బీజేపీ నాయకుడు మరియు మంత్రి కిషన్ రెడ్డి ఈయనను ఆహ్వానించారని తెలుస్తోంది. ఇక దీని వెనుక ఏపీ సీఎం జగన్ హస్తం కూడా ఉందట. రానున్న అతి తక్కువ కాలంలో చిరంజీవి బీజేపీలోకి రానున్నారు అని వార్తలు వస్తున్నాయి.

ఇందుకు జగన్ చిరును ఒప్పించే బాధ్యత ను తీనుకున్నారట. మరి చిరంజీవి బీజేపీలోకి రావడం వలన ఉపయోగం ఏమిటన్నది మాత్రం ఎవ్వరికీ అంతుపట్టడం లేదు. ఇందులో ఆంతర్యం ఏమిటన్నది త్వరలో తెలియనుంది. ఇది మెగా ఫ్యాన్స్ కు నచ్చడం లేదన్నది మరికొందరి అభిప్రాయం. ఇక తెలుస్తున్న సమాచారం ప్రకారం ఇది పవన్ కు చిరు కు మధ్యన బేధాలు తెచ్చేలా ఉందట.

మరింత సమాచారం తెలుసుకోండి: