రాజకీయంగా జరుగుతున్న తాజా పరిణామాలను చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. వచ్చే ఎన్నికలు ఇటు జగన్మోహన్ రెడ్డి అటు చంద్రబాబునాయుడుకు అత్యంత కీలకమైనవనటంలో సందేహంలేదు. జగన్, చంద్రబాబులకు వచ్చే ఎన్నికలు రెండు రకాలుగా అగ్నిపరీక్షలాంటివనే చెప్పాలి. ఎలాగంటే తెలుగుదేశంపార్టీ గెలవకపోతే చంద్రబాబు రాజకీయ జీవితం దాదాపు ముగిసిపోవటం ఖాయం. వయసురీత్యా వచ్చే ఎన్నికలనాటికి చంద్రబాబుకు 75 ఏళ్ళొస్తుంది.





వచ్చే ఎన్నికల్లో ఓడిపోతే ఇక ఆ తర్వాత అంటే 2024 ఎన్నికలకు చంద్రబాబు రాజకీయంగా యాక్టివ్ గా ఉండలేరన్నది వాస్తవం. ఎందుకంటే అప్పటికి 79 ఏళ్ళకు చేరుకుంటారు. ఇప్పటికే చాలా సందర్భాల్లో  తానేం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియటంలేదు. వచ్చే ఎన్నికల్లో ఓటమి ప్రభావం చంద్రబాబుపై ఇంకా ఎక్కువైపోతుంది. ఇదే సమయంలో లోకేష్ నాయకత్వంపై తమ్ముళ్ళకు నమ్మకలేదు కాబట్టి టీడీపీ పరిస్ధితి తెలంగాణాలో లాగైపోతుంది.






ఇదే సమయంలో జగన్ గనుక గెలవకపోతే అంతే సంగతులు. జగన్ పై వ్యతిరేకత చంద్రబాబు అండ్ కో లో కొండంతగా పేరుకుపోయుంది. ఈ కసినంతా ఎన్నిరకాలుగా అవకాశముంటే అన్నిరకాలుగాను కచ్చితంగా జగన్ మీద చూపటం ఖాయం. కాబట్టి ఆ పరిస్ధితి నుండి తనను తాను రక్షించుకోవాలంటే వచ్చే ఎన్నికలను కచ్చితంగా జగన్ గెలిచితీరాల్సిందే.





వీళ్ళద్దరితో పోల్చుకుంటే పవన్ వ్యవహారం వేరుగా ఉంది. ఎలాగంటే గెలిస్తే అంటే అధికారంలోకి వచ్చేస్తారని కాదు. కనీసం ఓ పదిసీట్లలో గెలిచినా జనసేన అనే పార్టీ కొంతకాలం ఉంటుంది. ఎక్కడా గెలవలేదనుకోండి సింపుల్ గా రాజకీయాలు వదిలేసి సినిమాల్లోకి వెళిపోతారు. ఎన్నికల్లో గెవలకపోయినా పవన్ కొచ్చే నష్టమేమీలేదు.






ఎందుకంటే అధికారంలోకి వచ్చేయాలని, ముఖ్యమంత్రి అయిపోవాలనే కసేమీ పవన్లో లేదు. తగిలితే లక్షరూపాయల లాటరీ పోతే 10 రూపాయలన్న పద్దతిలోనే ఉంటోంది పవన్ వ్యవహారం. కాబట్టి గెలుపయినా ఓటమయినా పవన్ కు పెద్దగా తేడాఏమీ ఉండదు. కాకపోతే పవన్ను నమ్ముకుని చొక్కాలు చింపుకున్న తమ పరిస్ధితే ఏమిటన్నది ఎవరివారుగా ఆలోచించుకోవాలి. ఇపుడు చెప్పండి వచ్చే ఎన్నికల విషయంలో  జగన్, చంద్రబాబు పరిస్ధితికి పవన్ పరిస్ధితికి ఎంత తేడా ఉందో.



మరింత సమాచారం తెలుసుకోండి: