చదువుకు వయసుతో సంబంధం ఏముంది అని చెబుతూ ఉంటారు. చదువుకోవాలనే పట్టుదల ఉండాలి కానీ ఏ వయసులో అయినా ఎంతో ఆనందంగా చదువుకోవచ్చు అని అంటూ ఉంటారు. ఇలా వయస్సును పరిగణలోకి తీసుకోకుండా చదువుపై ఆసక్తి ఉన్న వారు ఎంతోమంది వయస్సు దాటి పోయిన తర్వాత కూడా చిన్నారులతో కలిసి పరీక్షలు రాసి ఉత్తీర్ణులు అవ్వడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు వరకు ఎంతోమంది ప్రముఖులు ఇలా ఎట్టి పరిస్థితుల్లో తమ చదువును పూర్తి చేయాలనే ఉద్దేశంతో నలభై, యాభై ఏళ్ల వయసు వచ్చినా కూడా ఇంక చదువులు కొనసాగిస్తూ ఉండటం చూస్తూ ఉన్నాం.


 అయితే నేటి రోజుల్లో పిల్లలు మాత్రం చదువుకోవాల్సిన వయస్సులో స్కూళ్లు కళాశాలలు కు వెళ్ళడం మానేసి చివరికి గాలి తిరుగుళ్ళు తిరుగుతున్న వారే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇలా చదువు మీద ఆసక్తి లేకపోవడంతో ఎంతోమంది పరీక్షలోనూ ఉత్తీర్ణులు కాలేక పోతున్నారు. చివరికి పాస్ కాలేకపోతున్న మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంటున్నారు ఎంతోమంది. ఇలా నేటి రోజుల్లో చదువులు ఇలా కొనసాగుతుంటే నిన్నటి మొన్నటి తరం వారు మాత్రం ఇంకా పరీక్షలు రాస్తూ ఉత్తీర్ణులు అవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇటీవల ఏకంగా ఒక ఎమ్మెల్యే  కుటుంబ పరిస్థితుల కారణంగా చదువును ఆపేయాల్సి వచ్చింది. ఇప్పుడు 58 ఏళ్ళ వయసులో పదవ తరగతి పరీక్ష రాశాడు.



 అంతేకాదు ఉత్తీర్ణుడు కూడా అయ్యాడు. ఒడిషా కందమాల్ జిల్లా ఫుల్ బానే ఎమ్మెల్యే అంగడి కన్హర్ వయసు 58 ఏళ్లు. 1978లో ఆయన తన చదువు ఆపేశారు. తర్వాత కాలంలో రాజకీయ నాయకుడిగా ఎంతగానో గుర్తింపు సంపాదించారు. ఇక ఇప్పుడు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే ఆయనకు ఎప్పుడూ పదవ తరగతి పూర్తి చేయాలనే ఆశ ఉండేది. ఇక ఇటీవల ఓపెన్ స్కూల్ సర్టిఫికెట్ నిర్వహించిన పరీక్షలు రాశారు ఆయన.  ఇక ఈ పరీక్ష ఫలితాలలో వేగంగా బి1 గ్రేడ్ సంపాదించారు. 500 మార్కులకుగాను 361 మార్కులు సంపాదించారు సదరు ఎమ్మెల్యే. చదువుకు వయస్సు హోదా తో సంబంధం లేదని మరోసారి నిరూపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: