చాలా మందికి ఒక వయ్యస్సు రాగానే డ్రైవింగ్ చేయాలనీ, సొంత బండి వుండాలని ఎన్నెన్నో ఊహించుకుంటారు..డ్రైవింగ్ నేర్చుకున్న అంత సులువుగా డ్రైవింగ్ రావడం లేదు.. రోడ్డు శాఖ అధికారుల పర్యవేక్షణ లో డ్రైవింగ్ అంటే టెస్ట్ డ్రైవ్ చెయ్యాలి.. కొన్ని నియమాలను, నిభంధనలు తప్పక పాటించాలి.ఇలా ఒకటేమిటి ఎన్నెన్నో టెస్ట్ లు పాస్ అయితే అప్పుడు లైసెన్స్ ఇస్తారు. లేదంటే టెస్ట్ లకు వెళుతూనే ఉండాలి.. ఒక ఎగ్జామ్ కూడా రాయాలి..అందులో పాస్ అవ్వాలి.. ఇలా ఒకటేమిటి ఎన్నో వుంటాయి..అయితే రెండు,మూడు సార్లు ఫెయిల్ అయిన తర్వాత లైసెన్స్ మన చేతికి వస్తుంది. ఇది ఒకప్పటి మాట ఇప్పుడు అలాంటివి అవసరం లేదని ఓ వార్త వినిపిస్తోంది.


డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే ముందుంగా దరఖాస్తు చేసుకొవాలి. ఆతర్వాత తమ పరిధిలోని ఆర్టీవో ఆఫీసుకు వెళ్లాలి. ఆతరువాత అక్కడ గైడ్‌లైన్స్ ప్రకారం డ్రైవింగ్ చేస్తే..లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్‌.. ఆ తర్వాత శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్‌ను అధికారులు మంజూరు చేసేవారు. అయితే.. ఇక నుంచి అలాకాకుండా ప్రతి సామాన్యుడు డ్రైవింగ్ లైసెన్స్ పొందేలా గురువారం కేంద్ర జాతీయ రహదారుల.. రవాణాశాఖ మంత్రిత్వశాఖ ఓ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆర్టీవో ఆఫీసుకెళ్లి, దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని ప్రకటించింది. కాగా.. ఆర్డీవో కార్యాలయం వద్ద తప్పనిసరిగా టెస్ట్‌కు హాజరుకావాల్సిన అవసరం లేదని, కేవలం గుర్తింపు పొందిన డ్రైవర్ ట్రైనింగ్ సెంటర్లలోనే డ్రైవింగ్ లైసెన్స్ పొందొచ్చనీ, అన్నీ సదుపాయాలను కల్పించేలా కేంద్ర.. రాష్ట్ర అధికారులు నిర్ణయం తీసుకున్నారు.


డ్రైవింగ్ శిక్షణ పొందిన వారికి అక్రిడిటేడ్ డ్రైవర్ ట్రైనింగ్ సెంటర్లు ఇక నుంచి డ్రైవింగ్ లైసెన్స్‌లు జారీ చేస్తాయి. అలా అక్రిడిటేడ్ డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్ల వద్ద డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే ఆయా సంస్థల వద్ద డ్రైవింగ్ శిక్షణ కోసం పేరు నమోదు చేసుకోవాలి. ట్రైనింగ్‌.. దానికి సంబంధించిన పరీక్ష పాసైన తర్వాత సంబంధిత అభ్యర్థులకు ఆయా ట్రైనింగ్ సెంటర్లు సర్టిఫికెట్లు జారీ చేస్తాయి. అయితే.. అటుపై శిక్షణ పొందిన వ్యక్తులు డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అందుకోసం ఆర్టీవో వద్ద ఎటువంటి టెస్ట్ లేకుండానే ట్రైనింగ్ సర్టిఫికెట్ ఆధారంగా డ్రైవింగ్ లైసెన్స్ పొందొచ్చు. అయితే.. సదరు ట్రైనింగ్ కేంద్రాలు.. స్టిమ్యులేటర్లు, డెడికేటెడ్ టెస్ట్ ట్రాక్‌లను కలిగి ఉండాలి. లైట్ మోటార్ వెహికల్స్, మీడియం.. హెవీ వెహికల్స్ డ్రైవింగ్‌లో సదరు అక్రిడేటెడ్ డ్రైవర్ ట్రైనింగ్ సెంటర్లు శిక్షణ ఇస్తాయి. లైట్ మోటార్ వెహికల్స్ డ్రైవింగ్ శిక్షణ 29 గంటల పాటు ఉంటుంది. కోర్స్ ప్రారంభించిన నాలుగు వారాల్లో శిక్షణ పూర్తి కావాలి. ట్రైనింగ్ సెంటర్లు తమ వద్దకు వచ్చిన అభ్యర్థులకు థియరీ, ప్రాక్టికల్ నాలెడ్జ్ అందించాలని, ఈ సెంటర్లు ఇండస్ట్రీ-స్పెసిఫిక్ స్పెషలైజ్డ్ శిక్షణ కూడా అందిస్తాయి..ఇలాంటి సెంటర్స్ వల్ల డ్రైవింగ్ లైసెన్స్ వ్యవస్థను ప్రైవేటీకరించడమేనని.. ఈ సెంటర్లు సంబంధిత వ్యక్తులకు సరైన వెరిఫేషన్లు, తనిఖీలు చేయకుండానే డ్రైవింగ్ లైసెన్స్‌లు జారీ చేస్తాయని ఆయా అధికారులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: