వైసీపీ నర్సాపురం  తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం ఏదో తేడాగా కనబడుతోంది. ఆయనకి ఏవో మానసిక సమస్యలున్నట్లు అనుమానంగా ఉంది. ఎందుకంటే ప్రతిరోజు వైసీపీ ప్రభుత్వంతో పాటు జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తునే ఉన్నారు. జగన్ మీద ఏదన్నా కోపముంటే ఏదన్నా సందర్భం వచ్చినపుడు చూపించటం సహజమే. కానీ ఇక్కడ ఎంపీ చేస్తున్నదేమంటే ప్రతిరోజు అంటే జగన్ లేచినా, పడుకున్నా, కూర్చున్నా కూడా తప్పుపడుతునే ఉన్నారు.






తాజాగా తనను జగన్ చంపటానికి కుట్రపన్నినట్లు సహచర ఎంపీలకు ఫిర్యాదుచేస్తు లేఖ రాశారు. ఏపీ డీజీపీ రాజేంద్రనాధరెడ్డి, సైబరాబాద్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్రతో కలిసి తనను చంపేందుకు జగన్ ప్లాన్ చేసినట్లు లేఖలో ఆరోపించారు.  ఒకసారేమో తనింట్లోకి పోలీసులను పంపించటం ద్వారా కుటుంబసభ్యులందరినీ చంపేందుకు ప్లాన్ జరిగిందంటారు. మరోసారేమో తాను ప్రయాణిస్తున్న రైలుభోగీని తగలబెట్టడం ద్వారా చంపాలని కుట్ర పన్నినట్లు చెబుతున్నారు.





ఇక్కడ గమనించాల్సిందేమంటే రాజుకు ఏమైనా అయితే ఆ నిందను భరించాల్సింది తానే అన్న విషయం జగన్ కు తెలీదా ? ప్రపంచమంతా తననే అనుమానంగా చూస్తుందని జగన్ కు అంతమాత్రం ఇంగితం లేదా ? చివరకు ఎంపీకి నిద్రలో ఏమన్నా అయినా దానికి కూడా జగనే కారణమనే అంటారందరు. కాబట్టి ఎంపీని చంపేందుకు కుట్ర చేయాల్సిన అవసరం కానీ, అసలు ఎంపీని చంపితే జగన్ కు వచ్చే లాభంకానీ ఏమీలేదు.





గతంలోనే జగన్ను డ్యామేజ్ చేసే ఉద్దేశ్యంతోనే ఎంపీ అప్పట్లో నరేంద్రమోడీ, అమిత్ షాతో పాటు చాలామంది ఎంపీలకు లేఖలురాశారు. అప్పట్లో కొందరు స్పందిచారు మిగిలిన వాళ్ళు పట్టించుకోలేదు. ఇపుడు మళ్ళీ ఎంపీలందరికీ జగన్ కు వ్యతిరేకంగా లేఖలు రాశారు. ఇదంతా చూస్తుంటే ఎంపీ మానసికపరిస్ధితిపైనే అనుమానంగా ఉంది. మానసికంగా ఎంపీ బ్యాలెన్స్ కోల్పోయారా అనే చర్చ కూడా జరుగుతోంది. ఎంపీ లేఖకు ఇపుడు మిగిలిన ఎంపీల్లో ఎంతమంది స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: