ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీగా తనకు తాను చెప్పుకునే చంద్రబాబునాయుడు రాజకీయానికి 2014వరకు తిరుగే లేదు. ఎప్పుడైతే ప్రధాన ప్రతిపక్షనేతగా జగన్మోహన్ రెడ్డి ఎదురు నిలిచారో అప్పటినుండే చంద్రబాబు ఫెయిల్యూర్ మొదలైంది. అప్పటివరకు ప్రత్యర్ధుల బలహీనతనే తన బలంగా చెలామణి అయిన చంద్రబాబుకు జగన్ రూపంలో గట్టి ప్రత్యర్ధి కొరకరాని కొయ్యలాగ తయారయ్యాడు. ఆ దెబ్బేంటో చంద్రబాబుకు 2019 ఎన్నికల్లోల గట్టి తగిలింది. తగలటమే కాకుండా ఇంకా కంటిన్యు అవుతునే ఉంది.

చంద్రబాబు 40 ఏళ్ళ రాజకీయప్రస్ధానాన్ని దగ్గరనుండి చూస్తే కేవలం మ్యానేజ్మెంట్ స్కిల్స్ వల్లే ఎదిగిన విషయం తెలిసిపోతుంది. చంద్రబాబు ఎప్పుడు కూడా జనబలమున్న నేతకాదు. కేవలం అడ్డదారుల్లో, దొడ్డిదారిలో, వెన్నుపోటు, మ్యానేజ్మెంట్ స్కిల్స్ వల్లే ముఖ్యమంత్రిస్ధాయికి ఎదిగారు. ఈయనకు అతిపెద్ద బలం మీడియా మ్యేనేజ్మెంట్. అలాగే వివిధ వ్యవస్ధల్లో తన మనుషులను ఏర్పాటుచేసుకోవటం.

కాంగ్రెస్ లో సీఎంలు అయిన వాళ్ళంతా చంద్రబాబుతో మనకెందుకులే అని చూసీచూడనట్లుండేవారు. చివరకు వైఎస్ తో కూడా చంద్రబాబు లోపాయికారీగా లాబీయింగ్ నడిపించారు. అయితే వైఎస్ హఠాత్తుగా చనిపోవటంతో జగన్ కాంగ్రెస్ లో నుండి బయటకు వచ్చి కొత్తపార్టీ పెట్టుకున్నారు. అప్పటినుండి జగన్ పైన చంద్రబాబు తుపాకీ గురిపెట్టినట్లుగా రాజకీయాలు మొదలుపెట్టారు. దాంతో జగన్ కూడా అదేపద్దతిలో ఎదురుతిరిగారు. దానికితోడు మ్యానేజ్మెంట్ కి జగన్ ఏ రూపంలో కూడా లొంగలేదు.

పైగా ఎల్లోమీడియాను అసలు లెక్కేచేయటంలేదు. అంటే చంద్రబాబుకు మద్దతుగా నిలుస్తున్న వ్యవస్ధల్లో దేన్నీ జగన్ లెక్కచేయటంలేదు. దాంతో జగన్ కు ఎలాగ చెక్ పెట్టాలో చంద్రబాబుకు అర్ధంకాలేదు. ఇదే సమయంలో 2019 ఎన్నికల్లో జగన్ కొట్టినదెబ్బకు చంద్రబాబుకు కళ్ళుబైర్లు కమ్మి దిక్కుతోచని స్ధితిలో పడిపోయారు. ఈ కారణంగా జగన్ను ఎలా ఎదుర్కోవాలో కూడా తెలీటంలేదు. తాజాగా జరిగిన ప్లీనరీలో దుష్టచతుష్టయమంటు జగన్ ఎల్లోమీడియాను ఏకిపారేశారు. నిజానికి మీడియా జోలికెళ్ళాలంటేనే చాలామంది భయపడతారు. అలాంటిది డైరెక్టుగా మీడియా మీదే జగన్ యుద్ధం ప్రకటించటమంటే మామూలు విషయంకాదు. జగన్ రూపంలోనే చంద్రబాబు ఫెయిల్యూర్ మొదలైందనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: