నిజంగా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడుకు ఇంతకుమించిన అవమానం మరకొటుండదనే చెప్పాలి. జరిగిన అవమానం కూడా రెండు రకాలుగా జరిగింది. మొదటి అవమానం కన్నా రెండో అవమానం మరీ బాధాకరం. ఇంతకీ విషయం ఏమిటంటే ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధిగా పోటీచేస్తున్న ద్రౌపది ముర్ము మంగళవారం ఏపికి వచ్చిన విషయం తెలిసిందే. ప్రచారంలో భాగంగా మంగళగిరిలోని ఒ హాలులో జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీలు, ఎంఎల్ఏలతో ముర్ము సమావేశమై అందరి మద్దతుకోరారు.






ద్రౌపది ఏపీలోకి అడుగుపెట్టేముందు రోజు అంటే 11వ తేదీన చంద్రబాబు అధ్యక్షతన వ్యూహకమిటి సమావేశమై ద్రౌపదికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. నిజానికి ద్రౌపదికి మద్దతు ఇవ్వమని ఎన్డీయే నుండి ఎవరూ  చంద్రబాబును కోరలేదు. ఇదే సమయంలో నాన్ ఎన్డీయే పార్టీల తరపున పోటీచేస్తున్న యశ్వంత్ సిన్హాకి మద్దతు ఇవ్వమని కూడా ఎవరు అడగలేదు. అంటే చంద్రబాబును పాలక, ప్రతిపక్షాలు రెండు వదిలేశాయని దీంతో క్లారిటి వచ్చింది.






చివరినిముషంలో ఎన్డీయే నుండి ఎవరైనా మాట్లాడుతారని చంద్రబాబు ఎదురుచూసినా ఉపయోగం లేకపోయింది. దాంతో చేసేదిలేక తనంతట తానుగానే బాగా తగ్గిపోయి  ద్రౌపదికి మద్దతు ప్రకటించారు. ఇక్కడే చంద్రబాబుకు జరిగిన అవమానం బయటపడింది. ఇక్కడే అసలైన ట్విస్టు కూడా ఉంది. అదేమిటంటే ద్రౌపది ఏపీ పర్యటనలో భాగంగా  కలిసే అవకాశం ఇవ్వాలని టీడీపీ రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అడిగారట. దానికి కిషన్ బదులిస్తు పార్టీ పెద్దలతో మాట్లాడి వాళ్ళు చెప్పిందానిబట్టి సమాచారం ఇస్తానని చెప్పారట.






నిజంగా ఇంతకన్నా అవమానం చంద్రబాబుకు ఇంకోటుంటుందా. మద్దతు కోరకపోవటమే పెద్ద అవమానం. అలాంటిది తమంతట తాముగా మద్దతు ప్రకటించి, ద్రౌపదిని కలిసే అవకాశం ఇవ్వాలని అడిగితే పెద్దలతో మాట్లాడి ఏ సంగతి చెబుతానని కిషన్ చెప్పారంటే ఏమిటర్ధం ? అసలు టీడీపీ మద్దతు తమకు అవసరం లేదని చెప్పటమే కదా. సరే తెరవెనుక ఏమి జరిగిందో కానీ రాత్రికి చంద్రబాబు అండ్ కో తో ముర్ము భేటీఅయి మద్దతు కోరారు.  





మరింత సమాచారం తెలుసుకోండి: