తెలంగాణ ప్రభుత్వం కొత్త పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.. తాజాగా కొత్త పెన్షన్లను మంజూరు చెయ్యనుంద ని ఇటీవల వెల్లడించారు. ఆగస్టు మొదటి వారం నుంచే కొత్త పెన్షన్లు ఇస్తామని ప్రకటించారు మంత్రి కేటీఆర్‌. అర్హులైన అందరికీ పెన్షన్లు ఇస్తామని చెప్పారు మంత్రి కేటీఆర్‌. రాష్ట్రం లో ఐదు రకాల రంగాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి అన్నారు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. మొదటిది హరిత విప్లవం తో వ్యవసాయం పండగలా మారిందన్నారు. దీనికి అనుగుణంగా ఫుడ్ ప్రాసెసింగ్ పదివేల ఎకరాల్లో రావాలన్నారు.


ఒకప్పుడు తెలంగాణ లో చేపలు తక్కువగా దొరికేవని, ఇప్పుడు ఫిషరీస్ లో ఇండియా నెంబర్ వన్ గా మారిందన్నారు. కొత్తగా కట్టుకున్న రిజర్వాయర్లు మిషన్ భగీరథ తోనే ఇది సాధ్యమైందన్నారు. మీట్ ప్రాసెసింగ్ రావాలని, మీట్ ఇండస్ట్రీ భారత దేశాని కి కాక ఇతర దేశాల కు కూడా మాంసం ఎగుమతి చేసేలా తెలంగాణ అభివృద్ధి చెందాలని ఆయన అన్నారు.


రాష్ట్రంలో గొర్రెల పెంపకం ఎక్కువగా చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో కురుమ, గొల్ల సోదరుల కు గొర్ల పంపిణీ చేస్తున్నామ ని తెలిపారు. మన రాష్ట్రం లో వరి ఎక్కువగా పండిస్తున్నామని, వారికి ప్రత్యామ్నాయ పంటల పై అవగాహన కల్పించాలని అధికారుల కు సూచించారు. రాబోయే రోజుల్లో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు కోసం కృషి చేస్తున్నామన్నారు.. ఇంకా  తెలంగాణ ను అన్నీ విధాలుగా అభివృద్ధి చెయ్యాలని ప్రజల సహకారం కావాలని ఆయన ఈ సందర్భంగా ఆయన తెలిపారు.. మరోవైపు నిరుద్యోగుల కు కూడా ఉద్యోగ అవకాశాల ను కూడా కల్పిస్తున్నారు.. ఇంకా మహిళల కు కూడా అభివృద్ధి పథకాల ను అమలు చేయనున్నట్లు తెలిపారు.. నగరం లో భారీగా కురుస్తున్న వర్షాలకు రోడ్లు అన్నీ జలమయం అయ్యాయ ని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు. ఎక్కడైనా వరద ముప్పు ఉంటే వెంటనే సంభందిత అధికారులకు చెప్పాలని కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

Ktr