ఎన్ని డ్రామాలాడినా, ఎన్ని డైలాగులు చెప్పినా విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో బీజేపీ నేతలు చేతులెత్తేసినట్లు బయటపడింది.  ఒక ఇంటర్వ్యూలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి ఇచ్చిన డొంకతిరుగుడు సమాధానమే ఈ విషయాన్ని స్పష్టంచేస్తోంది. విశాఖ ఉక్కును నరేంద్రమోడి సర్కార్ ప్రైవేటుపరం చేయటం ఖాయం. అయితే ఆ విషయాన్ని జనాలకు పార్టీ నేతలు డైరెక్టుగా చెప్పరు. కాబట్టి నేతల ఆలోచనలను జనాలే తెలుసుకుని నోరుమూసుకుని కూర్చోవాలన్నట్లుంది.





ఉక్కు ప్రైవేటీకరణపై పురందేశ్వరా మాట్లాడుతు ఫ్యాక్టరీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించటమన్నది జాతీయ విధానమట. కేవలం విశాఖ ఉక్కును మాత్రమే ప్రైవేటుపరం చేయాలని కేంద్రం నిర్ణయించలేదు కదా అని మతిలేని మాటలు మాట్లాడారు. పార్టీ తరపున ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారట.  భోగస్ మాటలు తప్ప మరేమీలేదు.  ఫ్యాక్టరీ ఉంటే ప్రభుత్వంచేతిలో ఉండాలి లేదా ప్రైవేటు వ్యక్తులకు వెళ్ళిపోవాలంతే.






అంతేకానీ ప్రత్యామ్నయ మార్గమంటు ఏమీలేదు. వినేవాళ్ళున్నారు కదాని పురందేశ్వరి సోది చెప్పారు.  ఇలాంటి సోది చెప్పటంకన్నా డైరెక్టుగానే ఫ్యాక్టరీని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేస్తామని పార్టీ నేతలు కూడా చెప్పేస్తే ఒకపనైపోతుంది. పార్లమెంటులో మంత్రులేమో ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేయటం ఖాయమంటారు. ఫ్యాక్టరీలోని ఒక్కో విభాగాన్ని ప్రైవేటు సంస్ధలకు అప్పగించేందుకు నోటిఫికేషన్ కూడా ఇస్తోంది. ఇంకా ఏమిటి ప్రత్యమ్నాయమార్గాలను సూచించేది.






ఇదే ఇంటర్వ్యూలో వ్యాపారం చేసేపని ప్రభుత్వానిది కాదని మోడీయే చెప్పారని మళ్ళీ ఈమె చెప్పారు. ఇంటర్వ్యూలో తేలిందేమంటే విశాఖ ఫ్యాక్టరీ కూడా ప్రైవేటుపరం అయిపోతుందని. దాన్నే పురందేశ్వరి ఎందుకనో డైరెక్టుగా చెప్పే ధైర్యం చేయలేకపోతున్నారు. ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేసినా, చేయకపోయినా బీజేపీకి ఒక్కసీటు కూడా రాదు. అసెంబ్లీ, పార్లమెంటులో డిపాజిట్లు కూడా తెచ్చుకునేంత సీన్ బీజేపీకి లేదు. కాబట్టి ఇంకా ఫ్యాక్టరీపై ఎందుకీ నాటకాలు ఆడుతున్నారో అర్ధం కావటంలేదు. మోడీని ప్రభావింత చేసేంత సీన్ ఎన్డీయేలో, బీజేపీలో ఎవరికీ లేదని అందరికీ తెలుసు. కాబట్టి నాటకాలు కట్టిపెట్టి చెప్పేదేదో డైరెక్టుగా చెప్పేస్తే జనాలు చేయాల్సిందేదో చేసేస్తారు.





మరింత సమాచారం తెలుసుకోండి: