సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలు చుట్టుపక్కల పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తారు. ఎందుకంటే ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు ఇలా చేస్తూ ఉంటారు. ఇక ఇంట్లో ఎక్కడైనా వర్షపు నీరు పడుతుందని తెలిస్తే సరిచేసుకోవడం చేస్తారు. కానీ ఇక్కడ గ్రామస్తులు మాత్రం వర్షాకాలం వచ్చిందంటే చాలు స్మశానవాటిక దగ్గరికి వెళ్లి సమాధులను తవ్వుతూ  ఉంటారు. వినడానికి కాస్త విచిత్రంగా భయంకరంగా కూడా ఉంది కదా. కానీ ఇది నిజంగానే జరుగుతుంది అని చెప్పాలి.


 వర్షాకాలం వచ్చిందంటే చాలు ఊరి జనం అంతా ఒక్కటయ్యి స్మశాన వాటిక కు వెళ్లి  వెళ్లి ఒక్కో సమాధిని తవ్వడం లాంటివి చేస్తారు. అంతే కాకుండా ఏకంగా సమాధిలో ఉన్న శవాలకు నీళ్ళు తాగిస్తారు. ప్రతి ఏడాది వర్షాకాలంలో ఇలాంటివి చేస్తూనే ఉంటారు.. కర్ణాటకలోని బీజాపూర్ లోని కలికిరి గ్రామస్తులు ఇలా చేస్తూ ఉంటారు. అయితే దీని వెనుక పెద్ద స్టోరీ ఉండటం గమనార్హం. కొద్దిరోజుల నుంచి దేశమంతా ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కానీ కలికిరి గ్రామంలో ఒక్క చినుకు కూడా లేదు. దీంతో ఇక తమ గ్రామానికి ఒక శాపం కారణంగా ఇలా జరిగిందని గ్రామస్తులు భావించారు. గత నెల రోజుల్లో చనిపోయిన వారి లిస్టు ను సిద్ధం చేసిం మరి కుటుంబీకులతో చర్చలు జరిపి ఇక మీ ప్రియమైన ఆప్తుల దప్పిక తీర్చాలని వివరించారు.


 స్మశాన వాటిక కు వెళ్లి ఏ దిక్కున  తల ఉందో తెలుసుకొని రెండు అడుగుల లోతు గొయ్యి తవ్వి పైప్ ద్వారా నీళ్లు పట్టించడం చేశారు. ఇలా 25 మృతదేహాలకు నీళ్ళు తాగించారు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఇలా నీళ్లు తాగించిన కొద్దిసేపటికి ఆ ఊర్లో చినుకులు పడటం మొదలయ్యాయి.  కొద్ది రోజుల కిందట ఓ పెద్ద అయినా నోరు పెద్దగా తెరిచి చనిపోయాడట. నోరు మూయకుండానే గ్రామస్తులు ఖననం చేశారట. ఇలా చేయడం వల్లే ఆ గ్రామానికి శాపం పట్టుకుందని గ్రామస్తులు జ్యోతిష్యుని సంప్రదించగా ఇక సమాధులు తవ్వి దాహం తీర్చాలని ఐడియా ఇచ్చాడట. ఇక ఇది వినడానికి చాలా విచిత్రంగా ఉంది కదా.

మరింత సమాచారం తెలుసుకోండి: