జనసేన డిజిటల్ క్యాంపెయిన్ మొదలు పెట్టింది. రోడ్లపై ఉన్న గుంతల్ని ఫొటోలు తీసి గుడ్ మార్నింగ్ సీఎం సార్ అంటూ హ్యాష్ ట్యాగ్ జచతేసి సోషల్ మీడయాలో అప్ లోడ్ చేస్తోంది. మూడు రోజులుగా సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. గుంతలు పడిన రోడ్లపై పొర్లు దండాలు పెట్టేవారు, ఆ గుంతల్లో ఉన్న నీటితో చేతులు కడుక్కునేవారు, మగ్ తీసుకుని ఆ నీటితో స్నానం చేసేవారు.. ఇలా రకరకాల ఫీట్లు చేస్తూ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు జనసేన నాయకులు. అటు వైసీపీ తరపునుంచి కౌంటర్లు పడుతున్నా కవరింగ్ సాధ్యం కావడంలేదు. అవి చంద్రబాబు వేసిన రోడ్లు, అవి రిపేర్ కి వస్తే వాటికి జగన్ ఎలా బాధ్యులవుతారంటూ లాజిక్ తీస్తున్నారు కానీ, తమ హయాంలో రోడ్లు బాగు చేస్తున్నామని పూర్తి స్థాయిలో చెప్పుకోలేకపోతున్నారు. కానీ నెల్లూరు లాంటి చోట్ల డిజిటల్ క్యాంపెయిన్ కి ధీటుగా సమాధానమిస్తున్నారు కొంతమంది నాయకులు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో తాజాగా రూరల్ లో రోడ్ల నిర్మాణం జోరందుకుంది. ఆ రోడ్ల ప్రారంభోత్సవాల పేరుతో హడావిడి చేస్తూ జనసేనకు కౌంటర్ ఇస్తున్నారు నేతలు.

సహజంగా రోడ్ల నిర్మాణం మొదలయ్యే సమయంలో శంకుస్థాపనలకు హడావిడి జరుగుతుంది. కానీ ఏపీలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా పూర్తయిన రోడ్డు ప్రారంభోత్సవానికి నెల్లూరులో భారీ హంగామా చేశారు. మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి చేతుల మీదుగాఈ రోడ్డు ప్రారంభించారు. 10కోట్ల రూపాల వ్యయంతో 6 కిలోమీటర్ల మేర ఈ రోడ్ నిర్మించారు. ఈ రోడ్ నిర్మాణంతో ప్రజలు అధికార పార్టీ ఎమ్మెల్యేని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.

ఇటీవల నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జోరందుకున్నాయి. ఇటీవల డ్రైనేజీలో దిగి నిరసన తెలిపి మరీ ఉమ్మారెడ్డి గుంట ప్రాంతంలో డ్రైనేజీ నిర్మాణ పనులకు అనుమతి సాధించారు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, ఆ పనులకు శంకుస్థాపన కూడా చేశారు. రోడ్ల నిర్మాణం కూడా నెల్లూరు రూరల్ పరిధిలో దాదాపుగా పూర్తవుతోంది. ఇప్పుడు కొత్తగా రూరల్ లోని వివిధ ప్రాంతాలకూ నూతన రోడ్లు అందుబాటులోకి వచ్చాయి. జనసేన డిజిటల్ క్యాంపెయిన్ చేస్తున్న ఈ టైమ్ లో వారికి గట్టిగా కౌంటర్ ఇచ్చేందుకే ఇలాంటి కార్యక్రమాలను వైసీపీ హైలెట్ చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: