మనస్సుంటే ఎన్నో మార్గాలుంటాయి. ఇక అదే సందర్భంలో ఆలోచనవుంటే పన్ను బాదుడు నుంచి కూడా ఈజీగా తప్పించుకోవచ్చు. వార్షికంగా రూ.5.5 లక్షలకు మించి ఆదాయం కనుక వుంటే కనుక సాధారణంగా పన్ను అనేది మీరు చెల్లించాల్సి వస్తుంది.ఇక రూ.2.5 లక్షల వరకు అసలు పన్ను అనేది ఉండదు. ఆ తదుపరి 2.5 లక్షలపై 5 శాతం పన్ను రూ.12,500 మీరు చెల్లించాలి. కానీ, సెక్షన్ 87ఏ కింద దీనికి రిబేట్ అనేది ఉంటుంది. దీనికి తోడు స్టాండర్డ్ డిడక్షన్ కింద అందరికీ కూడా రూ.50వేల మినహాయింపు అనేది ఉంటుంది. కనుక ఎవరైనా కానీ, వారి ఆదాయం ఏడాదికి రూ.5.5 లక్షలకు మించి కనుక లేకపోతే ఖచ్చితంగా పన్ను చెల్లించాల్సిన అవసరం ఏర్పడదు.కానీ, రూ.5.5 లక్షలకు పైన ఆదాయం కలిగిన వారు అయితే ఈరోజుల్లో గణనీయ సంఖ్యలో ఉన్నారు. ఇక వీరంతా కూడా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఈ కొత్త పన్ను విధానం కాకుండా, పాత పన్ను విధానంలోనే కొనసాగితే ఎన్నో పన్ను ఆదా మార్గాలు చట్ట పరంగా మీకు ఉన్నాయి. వీటిని పూర్తిగా ఉపయోగించుకుంటే కనుక రూ.10.25 లక్షలు ఉన్నప్పటికీ రూపాయి పన్ను కట్టక్కర్లేదు.ఇక ప్రస్తుతం పాత పన్ను విధానం కింద రూ.5-10 లక్షల మధ్య ఆదాయం వుంటే 20 శాతం ఇంకా రూ.10-12.5 లక్షల మధ్య ఉంటే 30 శాతం అలాగే రూ.12.5 లక్షలకు పైన వుంటే కనుక 30 శాతం పన్నును మీరు చెల్లించాల్సి ఉంటుంది.


కొత్త పన్ను విధానాన్ని కనుక ఎంపిక చేసుకుంటే మాత్రం.. చాలా వరకు కూడా పన్ను మినహాయింపులను కోల్పోవాల్సి వస్తుంది. ఈ కొత్త పన్ను విధానంలో రూ.2.5-5 లక్షల ఆదాయంపై 5 శాతం ఇంకా రూ.5-7.5 లక్షల ఆదాయంపై 10 శాతం అలాగే రూ.7.5-10 లక్షల ఆదాయంపై 15 శాతం ఇంకా రూ.10-12.5 లక్షల ఆదాయంపై 20 శాతం మరియు రూ.12.5-15 లక్షల ఆదాయంపై 25 శాతం, ఆపైన కనుక ఉంటే 30 శాతం పన్ను రేటు అమలవుతుంది.ఇక ఈ పాత పన్ను విధానంలో ఉంటే సెక్షన్ 80సీ కింద వివిధ సాధనాల్లో ఏడాదికి మొత్తం రూ.1.5 లక్షలు ఆదా చేసుకోవాలి. దీంతో ఈ మొత్తం కూడా కలిపి రూ.7 లక్షల ఆదాయంపై పన్ను అనేది మీకు పడదు.ఇక గృహ రుణం తీసుకుని దానికి చెల్లించే వడ్డీని రూ.2 లక్షలు పన్ను మినహాయింపు కింద క్లెయిమ్ అనేది చేసుకోవచ్చు. దీంతో 9 లక్షల వరకు కూడా ఆదాయంపై పన్ను లేకుండా పోతుంది. ఇంకా అలాగే గృహ రుణం అసలుకు చేసే చెల్లింపులను సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల పరిమితి కింద మీరు చూపించుకోవచ్చు. ఇక పింఛను పథకమైన ఎన్ పీఎస్ లో కూడా ఏటా రూ.50వేలు మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనికి సెక్షన్ 24బీ కింద పన్ను మినహాయింపు అనేది ఉంది. దీంతో మొత్తం మినహాయింపు కూడా రూ.9.5 లక్షలకు చేరింది.ఇంకా అలాగే సెక్షన్ 80డీ కింద హెల్త్ ఇన్సూరెన్స్ ఇంకా హెల్త్ చెకప్ లకు చేసే ఖర్చును చూపించుకోవచ్చు. 60 ఏళ్ల లోపు వారికి మొత్తం రూ.25వేల వరకు కూడా మినహాయింపు ఉంది. ఇంకా అలాగే 60 ఏళ్లు పైబడిన వారు ఉంటే మొత్తం రూ.50 వేల రాయితీ పొందొచ్చు. ఈ రెండు విభాగాలు కలిపి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది రూ.75 వేల మొత్తంపై పన్ను పడదు. దీంతో ఇక మొత్తం పన్ను ఆదా ఆదాయం 10.25 లక్షలు చేరుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

TAX