సాధారణంగా ఎవరైనా శక్తికి మించి కష్టపడ్డారు అంటే చాలు గొడ్డుకష్టం చేశాడు అని చెబుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఎండ వాన అనే తేడా లేకుండా కాడెద్దులు   ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాయ్. ఇక రైతుకు వ్యవసాయంలో ఉపయోగపడుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా ఎంతగానో కష్టపడే ఎడ్ల కష్టాలను తీర్చడం ఎలా  అని ఆలోచించారు ఇక్కడ కొంతమంది. ఈ క్రమంలోనే ఇదే విషయంపై మనసుపెట్టి ఆలోచించి ఒక వినూత్నమైన ఆవిష్కరణ కు శ్రీకారం చుట్టారు. సాధారణంగా ఎడ్లబండ్లు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి ఒక్కరు ఇప్పటి వరకు చూసి ఉంటారు. రెండు వైపులా కాడెద్దులు కట్టి ఎడ్లబండి ఉంటుంది. ఈ క్రమంలోనే ఆ ఎద్దుల బండి లో ఎంత బరువు పెట్టినా కూడా ఎడ్ల బండిని ముందుకు నడిపించే కాడెద్దులు మాత్రం దానిని మోసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది.
 కానీ ఇక్కడ విద్యార్థులు చేసిన వినూత్నమైన ఆలోచన తో ప్రస్తుతం కాడెద్దుల కు  కాస్త శ్రమ తగ్గే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. మహారాష్ట్రలోని ఇస్లాంపూర్ కు చెందిన కొంతమంది విద్యార్థులు అక్కడి ఆర్ఐటీ లో మొబైల్ ఇంజనీరింగ్ చదువుతున్నారు. ఈ క్రమంలోనే ఒక వినూత్నమైన ఆవిష్కరణ కు శ్రీకారం చుట్టారు. మహారాష్ట్రలో 200 వరకు పంచదార పరిశ్రమలు ఉన్నాయి. కాగా సమీప గ్రామాల నుంచి చెరుకుని పరిశ్రమలకు తీసుకెళ్లాలంటే వందలాది మంది ఎడ్లబండిని ఉపయోగిస్తారు. ఈ క్రమంలోనే ఇక సదరు విద్యార్థులు కళాశాల కు వెళుతున్న సమయంలో భారీ లోడుతో ఉన్న బండ్లను ఎడ్లు లాగడంలో ఎంతో కష్టపడడం చూశారు.


 ఎలాగైనా వాటికి శ్రమను తాగించాలి అని భావించారు. ఈ ఆలోచనను ఆచరణలో పెట్టారు. ఈ ప్రాజెక్టుకు సారథి అనే పేరు పెట్టుకుని థర్డ్ రోలింగ్ సపోర్టు అనే అని  పరికరాన్ని  కనుగొన్నారు. బండి కాడికి రెండు వైపులా ఎడ్లు కడతారు. రెండింటి మధ్యలో కాడికి ఒక చక్రాన్ని బిగించారు . విద్యార్థులు కనుగొన్న సరికొత్త పరికరం ద్వారా అటు ఎడ్లు బండిని ముందుకు లాగుతున్న సమయంలో ఇక ఈ చక్రం సహాయంతో ఎంతో సులభంగానే బండి ముందుకు కదులుతోంది అనే చెప్పాలి. తద్వారా కాడెడ్లకు  ఇక ఎంతగానో శ్రమ తగ్గుతుంది. అయితే ఇక ఈ సరికొత్త పరికరాన్ని రానున్న రోజుల్లో అందరు రైతులకు అందుబాటులోకి తీసుకువస్తామని సదురు కళాశాల విద్యార్థులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: