మనసుంటే మార్గం ఉంటుంది అని చెబుతూ ఉంటారు పెద్దలు.  మనలో ఏదో ఒక లోపం ఉంది అని బాధ పడేకంటే ఆ లోపాలను సైతం అధికమించి పట్టుదలతో పోరాడితే ఏదైనా సాధించవచ్చు.. సొంత కాళ్లపై నిలబడ వచ్చు అని ఇప్పుడు వరకు ఎంతోమంది నిరూపించారు. అయితే కాళ్ళూ చేతులు అన్ని సరిగ్గా ఉన్నప్పటికీ సోమరులుగా మారిపోయి పని పాట లేకుండా తిరుగుతున్న వారు నేటి రోజుల్లో ఎంతోమంది కనిపిస్తుంటే ఒకవైపు శరీరంలో అవిటితనం తమని వెక్కిరిస్తున్న పట్టించుకోకుండా తమ కాళ్ల మీద తాము నిలబడేందుకు ఎంతో మంది ప్రయత్నాలు చేస్తున్న తీరు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది.



 ఇక్కడ ఇలాంటి ఒక గొప్ప స్ఫూర్తిదాయకమైన వ్యక్తి గురించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.  ఎంతోమంది అన్ని సరిగా ఉన్నా కూడా భిక్షాటన చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం తనకు చేతు లేకపోయినా ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోలేదు. ఒక చెయ్యి లేకపోయినా ఇంకోచెయ్యి ఉంది అని తనకు తాను ధైర్యం చెప్పుకొని సొంత కాళ్లపై నిలబడ్డాడు. ముంబైకి చెందిన వ్యక్తి పావు బజ్జీ బండి నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. ముంబై లో గల మాలాద్  వద్ద పావ్ బజ్జి బండి ఉంది. ఆ బండి నడుపుతున్న వ్యక్తికి ఒక చెయ్యి లేదు.



 కానీ ఎంతో చాకచక్యంగా పావు బజ్జి కోసం కూరగాయలు కట్ చేయడం లాంటివి చేస్తూ ఉన్నాడు. ఒక చేత్తో కత్తి పట్టుకుని వేళ్ళతో కూరగాయలు కట్ చేయడం చూస్తూ ఉంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు అని చెప్పాలి. ఎంతో రుచికరమైన పావ్ బజ్జి తయారు చేయడం ప్యాకెట్లలో వేయడం కూడా సొంతంగా చేస్తూ ఉన్నాడు. ఇలా ఒక చేయి లేకపోయినప్పటికీ నిరాశ చెందకుండా తన పని తాను చేసుకుంటూ ఎవరిమీద ఆధారపడకుండా తన కాళ్ళ మీద తాను నిలబడటమే కాదు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడూ.

మరింత సమాచారం తెలుసుకోండి: