పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. షెడ్యూల్ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపధ్యంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చంద్రబాబానాయుడు, లోకేష్ ప్రిస్టేజియస్ గా తీసుకున్నారు. పార్టీ తరపున సభ్యత్వ నమోదు కనీసం కోటి దాటాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఆమధ్య పార్టీ సభ్యుల సంఖ్య 60 లక్షలని ఘనంగా ప్రకటించుకున్నారు.





అంటే 60 లక్షల సభ్యత్వానికి మరో 40 లక్షల సభ్యులను కలిపి మొత్తం సభ్యత్వాన్ని కోటికి చేర్చాలని టార్గెట్ పెట్టుకున్నారు. 38 సంవత్సరాల పార్టీ కెరీర్లో 60 లక్షల సభ్యత్వాలుంటే మూడునెలల్లోనే 40 లక్షల సభ్యత్వాలనేది అసాధ్యం. అయినా సరే చంద్రబాబు డిసైడ్ చేశారు కాబట్టి నేతలు ఎదురుచెప్పేందుకేమీ లేదు. అయితే చంద్రబాబు అనుకున్నా తమ్ముళ్ళు అనుకున్నా సభ్యత్వాలు కోటికి ఎలా చేరుతుంది ? తీసుకునేవాళ్ళుండద్దు ?





ఇక్కడే సభ్యత్వ నమోదు కార్యక్రమం తేడాకొట్టేసింది. ఏప్రిల్ చివరలో మొదలుపెట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమం జూలై చివరకు కోటికి చేర్చాలన్న ప్లాన్ దారుణంగా దెబ్బకొట్టేసింది. గడచిన మూడున్నర నెలల్లో కనీసం 10 లక్షల మంది కూడా సభ్యత్వాన్ని తీసుకోలేదు. సభ్యత్వం తీసుకోమని న్యూట్రల్ జనాలను ఎంతగా అడుగుతున్నా ఎవరు పట్టించుకుంటున్నట్లు లేదు. అందుకనే ఎంత కష్టపడుతున్నా సభ్యత్వ నమోదు ముందుకుపోవటంలేదు.




మరోవైపు పెట్టుకున్న డెడ్ లైన్ దగ్గరకు వచ్చేస్తోందనే టెన్షన్ పెరిగిపోతోంది. అందుకనే ఈ కార్యక్రమం కోసం ఒక యాప్ ను తయారుచేసినట్లు దాని సర్వర్లో సమస్యలు మొదలవ్వటంతో సభ్యత్వ కార్యక్రమానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని నేతలు చెప్పుకుంటున్నారు. యాప్ లో సమస్యలు రెక్టిఫై కాగానే సభ్యత్వ నమోదు కార్యక్రమం ఊపందుకుంటుందని నేతలు చంద్రబాబుకు చెప్పుకుంటున్నారు. టీడీపీ అంటేనే టెక్నాలజీపార్టీగా పేరుంది. ఇలాంటి పార్టీలో కూడా టెక్నాలజీ సమస్యలు ఎదురువుతున్నాయంటే నమ్మబుద్ధి కావటంలేదు. అధికారంలో ఉన్నపుడు జనాలకు పెన్షన్లు, రేషన్ లాంటి లబ్ది దక్కాలంటే పార్టీ సభ్యత్వం తీసుకోవాల్సిందే అనే ఒత్తిడుండేదట. ఇపుడు అధికారంలో లేదుకాబట్టి జనాలు సభ్యత్వాన్ని పట్టించుకున్నట్లు లేదంతే.



మరింత సమాచారం తెలుసుకోండి: