ఇటీవలి కాలంలో బాగా డబ్బు సంపాదించిన వారు  తమకు ఇతరుల నుంచి ప్రాణహాని ఉంది అని భావిస్తే తమ వెంట భారీ జీతం ఇచ్చి మరి బాడీగార్డులను పెట్టుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు అనే విషయం తెలిసిందే. ఇక పోలీసు ఉన్నతాధికారులు ఎమ్మెల్యేలు మంత్రులు ఇంకా ఎంతో మంది ప్రజాప్రతినిధులు వెంట బాడీగార్డులు ఉండటం మనం చూస్తూనే ఉంటాము. ఇక సినీ సెలబ్రిటీలు క్రీడాకారుల వెంట కూడా కొన్ని కొన్ని సార్లు బాడీగార్డులు కనిపిస్తూ ఉంటారు. అయితే బాడీగార్డులను పెట్టుకోవడమే కాదు వారికి భారీగా జీతం కూడా చెల్లించాల్సి ఉంటుంది.


 అయితే ఇలా ఇప్పటి వరకూ ఎంతోమంది సంపన్నులు బాడీగార్డులను పెట్టుకోవడం చూశాము. కానీ రోడ్డుపై చక్రాల బండి మీద బట్టలు అమ్ముకునే వ్యక్తికి బాడీగార్డులు ఉండడం ఎప్పుడైనా చూసారా.. రోడ్డుపై చక్రాల బండి మీద బట్టలు అమ్ముకునే వ్యక్తికి బాడీగార్డులు అవసరం ఏముంది అని అంటారు ఎవరైనా.. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా ఇలా రోడ్డుపై వ్యాపారం చేసుకునే వ్యక్తికి ఇద్దరు బాడీగార్డులు ఉన్నారు. ఇక ఈ బాడీగార్డులను పెట్టింది ఎవరో కాదు ఏకంగా న్యాయస్థానం. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్లో వెలుగులోకి వచ్చింది. తోపుడు బండిపై వస్త్రాలు విక్రయించే ఒక వ్యక్తికి ఇద్దరు బాడీగార్డులు  ఉన్నారు. అతను వస్త్రాలు విక్రయిస్తూ బిజినెస్ చేసుకుంటూ ఉంటే బాడీగార్డులు తుపాకులతో రక్షణ కల్పిస్తున్నారు.

 ఇంతకీ ఏం జరిగిందంటే ఏటా జిల్లాకు చెందిన రామేశ్వర దయాళ్ తో తోపుడు బండి పై వస్త్ర వ్యాపారం చేస్తుంటాడు. తన భూమికి పట్టా ఇప్పించాలంటూ ఎస్పీ నేత మాజీ ఎమ్మెల్యే రామేశ్వర్ సింగ్ సోదరుడు జూగేంద్ర ను కలిశాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వివాదం తలెత్తగా కులం పేరుతో జుగేంద్ర తనను దూషించాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు రామేశ్వర్. ఇక జుగేంద్ర హైకోర్టుకు వెళ్లగా. రామేశ్వర్ దయాల్ ను చూసిన న్యాయమూర్తి బాధితుడికి ఎందుకు భద్రత కల్పించలేదు అంటూ ప్రశ్నించింది. ఈ క్రమంలోనే ఇద్దరు బాడీగార్డులను అతనికి భద్రత గా నియమించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: