ఓవర్ యాక్షన్ చేస్తే ఫలితం ఎలాగుంటుందో ? వ్యవహారం ఎలా రివర్సు కొడుతుందో తాజాగా బయటపడింది. శ్రీలంకలో పరిస్ధితులపై చర్చించేందుకు కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జై శంకర్ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. అంటే సమావేశం ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే శ్రీలంకలో పరిస్ధితుల ప్రభావాన్ని వివరించేందుకు మాత్రమే విదేశాంగశాఖ సమావేశాన్ని ఏర్పాటుచేసింది.అయితే శ్రీలంకలో పరిస్ధితులను వివరించటం మానేసి రాష్ట్రాల అప్పులు, అప్పులు చేయటంలో క్రమశిక్షణ లోపించటం, ద్రవ్యోల్బణం లోపించటం తదితర అంశాలపై కేంద్రమంత్రి జై శంకర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. దీంతో డీఎంకే, టీఆర్ఎస్, బెంగాల్, ఏపీ ఎంపీలు ఫుల్లుగా కేంద్రమంత్రిని వాయించేశారు. అసలు సమావేశం అజెండా ఏమిటి ? సమావేశంలో ప్రస్తావించిన అంశాలేమిటి అంటు ఒక్కసారిగా కేంద్రమంత్రిని అందరు తగులుకున్నారు. 


రాష్ట్రాల అప్పులు, ద్రవ్యోల్బణం గురించి చర్చించాలంటే కేంద్రం చేసిన అప్పులు, ద్రవ్యోల్బణం గురించి కూడా చర్చించాలని నిలదీశారు. నరేంద్రమోడి అధికారంలోకి వచ్చిన ఎనిమిదేళ్ళల్లో చేసిన రు. 95 లక్షల కోట్ల అప్పు మాటేమిటంటు నిలదీశారు. తెలంగాణా జీఎస్డీపీపీలో పరిమితికి మించి 29 శాతం అప్పుచేసిందని చెప్పటం బాగానే ఉందని అంటునే మరి కేంద్రం చేసిన 59 శాతం అప్పుల గురించి వివరించాలని టీఆర్ఎస్ పట్టుబట్టింది. ఆర్ధికలోటు జీడీపీలో 3.9 శాతం ఉంటే కేంద్రం ఆర్ధికలోటు 6.2 శాతంకు చేరుకోవటానికి కేంద్రం ఏమి సమాధానం చెబుతుందని సూటిగా ప్రశ్నించారు.తీసుకున్న అప్పును తీర్చటంలో తెలంగాణా ఎప్పుడైనా శ్రీలంకలో ఫెయిలయ్యిందా చెప్పమని ఎంపీలు గట్టిగా నిలదీసినపుడు కేంద్రమంత్రి, అధికారులు ఏమి సమాధానం చెప్పలేకపోయారు. సమావేశంలో వివిధ పార్టీల ఎంపీలు లేవనెత్తిన ప్రశ్నలకు, అభ్యంతరాలకు ఏమి సమాదానం చెప్పాలో తెలీక చివరకు ఉన్నతాధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఆపేసి సమావేశాన్ని ముగించేశారు. అసలు శ్రీలంక పరిస్ధితులపై హెచ్చరించేందుకు అఖిలపక్ష సమావేశం పెట్టడంలోనే కేంద్రప్రభుత్వం బుద్ధిలేనితనం బయటపడింది. తమలో తప్పులు పెట్టుకుని ఎదుటి వాళ్ళపై సవారీ చేస్తానంటే ఎవరు ఒప్పుకోరన్న విషయం మోడీ సర్కార్ కు అర్ధమైపోయుంటుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: