సాధారణంగా పోలీసులు అంటే సామాన్యుల పట్ల ఎంతో కఠినంగా ఉంటారని ఇక ఏదైనా తప్పు చేస్తే ఎంతో కఠినంగా వ్యవహరిస్తారని మాత్రమే అందరికీ తెలుసు. అందుకే పోలీసులను చూస్తే చాలు ఎంతోమంది వణికి పోతూ ఉంటారు  అని చెప్పాలి. పోలీస్ ఎక్కడైనా కనిపించాడు అంటే చాలు ఎందుకో తెలియకుండానే మనసులో చిన్న భయం పడుతూ ఉంటుంది. ఇక ఏదైనా తప్పు చేసినప్పుడు పోలీస్ ఎదురుగా కనిపిస్తే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయేమో అన్నంత భయం వేస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఎన్నో ఏళ్ల నుంచి పోలీసులు కాస్త కఠినంగా వ్యవహరించడంతో పోలీసులు అంటే ప్రజల్లో భయం కూడా కాస్త ఎక్కువగానే పెరిగిపోయింది.


 అయితే ఇటీవలి కాలంలో మాత్రం పోలీసులు ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అవలంబిస్తున్నారు. ఈ క్రమంలోనే ఖాకీ చొక్కా వేసుకొని ఎంతో గంభీరంగా కనిపించే పోలీసులకు అదే ఖాకీ చొక్కా వెనకున్న మనసు మాత్రం ఎంతో నిత్యమైనది  అని ఇప్పటి వరకు ఎంతోమంది నిరూపించారు. ఒకవైపు విధినిర్వహణలో ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూనే మరోవైపు సోషల్ సర్వీస్ కూడా చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు ఎంతో మంది పోలీసు అధికారులు. ఇక్కడ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసి ఓ పోలీసు వార్తల్లో నిలిచాడు అనే చెప్పాలి.



 సాధారణంగా ఎవరైనా ఉద్యోగం చేస్తున్న వారు సెలవు దొరికిందంటే చాలు హాయిగా ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకోవాలి అని భావిస్తూ ఉంటారు. అయితే రాత్రింబవళ్లు పని చేసి ప్రజలకు రక్షణ కల్పించే ఓ పోలీస్ అధికారి మాత్రం సెలవు దినాల్లో కూడా విశ్రాంతి తీసుకోకుండా సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యకు చెందిన పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ రంజిత్ యాదవ్ బిక్షాటన చేసే అనగారిన  కుటుంబాలకు చెందిన పిల్లలకు ఉచిత విద్యను అందిస్తున్నాడు. ఇక పేద విద్యార్థుల కోసం సొంత పాఠశాలను ప్రారంభించాడు. సెలవు  దొరికినప్పుడల్లా స్వయంగా పిల్లలకు పాఠాలు బోధిస్తున్నాడు. దీంతో ఈ పోలీస్ అన్న మంచి మనసుకు అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: