తెలుగుదేశంపార్టీ విజయవాడ ఎంపీ కేశినేని తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గనుక 40 సీట్లు సాధిస్తే చంద్రబాబునాయుడు నుండి సీఎం రమేష్ పార్టీని లాగేసుకుంటారని నాని చేసిన వ్యాఖ్యలు పార్టీలో  కలకలం సృష్టిస్తున్నాయి. చంద్రబాబు పాలిట సీఎం రమేష్ మరో ఏక్ నాథ్ షిండే అవుతారని ఎంపీ జోస్యం చెప్పారు. 2024 ఎన్నికల్లో గెలిచేంత సీన్ టీడీపీకి లేదని, గెలిపించే సత్తా చంద్రబాబుకు కూడా లేదని ఎంపీ కుండబద్దలు కొట్టకుండానే చెప్పారు.





కొంతకాలంగా చంద్రబాబుతో ఎంపీకి బాగా గ్యాప్ పెరిగిపోయింది. దాంతో స్వపక్షంలోనే విపక్షంగా మారటంతో  చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా తయారయ్యారు. ఈ నేపధ్యంలోనే ఎంపీ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతు వచ్చే ఎన్నికల తర్వాత టీడీపీ భూస్ధాపితమైపోతుందన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత టీడీపీలో కూడా ‘ఆపరేషన్ షిండే’ తప్పదని అదికూడా సీఎం రమేష్ ద్వారానే జరుగుతుందన్నారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే ప్రస్తుతం బీజేపీ రాజ్యసభ ఎంపీగా ఉన్న సీఎం రమేష్ నిజానికి టీడీపీ ఎంపీయే.





2019 ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోవటంతో ఎందుకైనా మంచిదని భావించిన చంద్రబాబు నలుగురు టీడీపీ రాజ్యసభ ఎంపీలను బీజేపీలోకి పంపారు. అలా వెళ్ళినవారిలో సీఎం రమేష్ కూడా ఉన్నారు. రమేష్ కు క్షేత్రస్ధాయిలో పట్టుమని వంద ఓట్లు తెచ్చేంత సీన్ కూడా లేదని టాక్. కాకపోతె తెరవెనుక వ్యవహారాలను చక్కబెట్టడంలో మాత్రం మంచి నేర్పరట. నిజానికి వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే ప్రత్యేకించి సీఎం రమేషో లేదా మరెవరో పార్టీని చీల్చాల్సిన అవసరంలేదు.






ఇపుడు తెలంగాణాలో పార్టీ ఎలాంటి పరిస్ధితిలో ఉందో ఏపీలో కూడా అలాగే అయిపోతుంది. ఇపుడు వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీలు ప్రెస్ నోట్లకు మాత్రమే ఎలా పరిమితమైపోయాయో టీడీపీ కూడా అలాగే అయిపోతుంది. ఇంతోటి పార్టీని చీల్చేందుకు ఆపరేషన్ షిండే అవసరమే లేదు.  వచ్చే ఎన్నికల్లో పార్టీ తరపున గెలిచిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళలో దాదాపు ఎవరూ టీడీపీలో ఉండరు. పార్టీయే కుప్పకూలే పరిస్దితిలోకి పడిపోతే ఇక ఆపరేషన్ షిండే అవసరం ఏముంటుంది ?  

మరింత సమాచారం తెలుసుకోండి: