నరేంద్రమోడీ ప్రభుత్వం మరీ అన్యాయంగా తయారవుతోంది. పేదలు, మధ్య తరగతి జనాలే కాదు చివరకు ఎగువ మధ్యతరగతి జనాలను కూడా ప్రశాంతంగా బతకనిచ్చేట్లు లేదు. అన్నింటి ధరలను పెంచేస్తోంది. ప్రతి వస్తువును జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చేసి ధరలను పెంచేస్తోంది. ఒకవైపు ఉద్యోగాలను భర్తీ చేయటంలేదు. మరోవైపు ప్రభుత్వరంగ సంస్ధలను అమ్మేస్తోంది. ఇంకోవైపు నిత్యవాసరాల ధరల సబ్సిడీలకు కోతపెట్టడం లేదా ధరలను పెంచేయటంతో అందరినీ బాగా ఇబ్బందులు పెడుతోంది.





ఇవన్నీ సరిపోదన్నట్లు రైళ్ళల్లో ప్రయాణిస్తున్న సీనియర్ సిటిజన్లకు ఇంతకాలం టికెట్ల ధరల్లో ఉన్న రాయితీలను శాశ్వతంగా రద్దుచేసింది. కరోనా వైరస్ కారణంగా ఆదాయం పడిపోతోందని చెప్పి రైలు ప్రయాణాల్లో ఉన్న అన్నీ క్యాటగిరీల వాళ్ళకు ఇస్తున్న రాయితీలను కేంద్రం రద్దుచేసింది. ఇపుడు కరోనా తగ్గుముఖం పట్టకపోయినా జనజీవనమైతే మామూలుగానే సాగుతోంది. అయితే రైళ్ళల్లో రద్దుచేసిన రాయితీలను కొన్ని క్యాటగిరీలకు మాత్రమే కంటిన్యు చేస్తోందంతే. రద్దయిన క్యాటగిరిల్లో వృద్ధులున్నారు.





వివిధ క్యాటగిరిల్లో ఇస్తున్న రాయితీల వల్ల 2017-20 మధ్య రు. 4,794 కోట్లు రైల్వేకి నష్టం వచ్చిందని రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. వృద్ధులకు రాయితీని రద్దుచేసిన ఇదే శాఖ ఎంపీలు, మాజీ ఎంపీలకు మాత్రం రాయితీలను ఎందుకిస్తున్నట్లు ? ఎంపీలు లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు. అలాగే మాజీ ఎంపీలు కూడా వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నారు.  






విచిత్రం ఏమిటంటే ఒకసారి ప్రజాప్రతినిధిగా గెలిస్తే చాలు తరలపాటు హాయిగా కూర్చుని తినేంత సంపాదిస్తున్న ప్రజాప్రతినిదులే ఎక్కువగా ఉన్నారు. అచ్చంగా జీతబత్యాల మీద మాత్రమే బతికే ఎంపీలున్నారని చెబితే ఎవరైనా నమ్ముతారా ? ఇలాంటి ఎంపీలు, మాజీ ఎంపీలకు రాయితీ ఇస్తున్న మోడీ సర్కార్ కు వృద్ధులకు ఇచ్చే రాయితీలే భారమైపోయాయా ?  ఏమిటో మోడీ ప్రభుత్వం పూర్తిగా మధ్య తరగతి జనాలకు బాగా దూరమైపోతోంది. ఏదో అదృష్టం కొద్దీ ఎన్నికల్లో గెలుస్తోందని సరిపెట్టుకోవాలంతే.




మరింత సమాచారం తెలుసుకోండి: