ఈరోజు ఎలాగైనా ఎక్కువ చేపలు పట్టాలి అనే ఉద్దేశంతో జాలర్లు అందరూ కూడా సముద్రంలో వేటకు వెళుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇలా వేటకు వెళ్లిన సమయంలో ఎప్పటిలాగానే సాధారణ చేపలు వారి వలకు చుక్కుతూ ఉంటాయి. కానీ కొన్నిసార్లు మాత్రం జాలర్లకు అదృష్టం కలిసి వచ్చి ఊహించని రీతిలో అదృష్ట లక్ష్మీ కటాక్షం లభిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఇక జాలర్లకు అరుదైన చేపలు చిక్కటం ఇక ఆ చేపలు లక్షల రూపాయలకు అమ్ముడుపోవడం జరుగుతూ ఉంటుంది.


 ఇక్కడ కూడా జాలర్లకు ఇలాంటి అదృష్టం వరించింది అనే చెప్పాలి. ఎప్పటిలాగానే చేపలు పట్టేందుకు సముద్రంలో వేటకు వెళ్లారు జాలర్లు. ఈ క్రమంలోనే ఈ వేటలో వారికి దొరికిన ఒక విలువైన పదార్థం వారిని కోటీశ్వరులు చేసింది అని చెప్పాలి. సాధారణంగా తిమింగలం వాంతికి ఎంత డిమాండ్ వుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ క్రమంలోనే ఇటీవల జాలర్లకు తిమింగలం వాంతి దొరకగానే 30 కోట్లు దక్కించుకున్నారు. ఆ తిమింగలం వాంతి 28 కిలోల 400 గ్రాములు ఉండడం గమనార్హం. విజంజం కు 32 కిలోమీటర్ల దూరంలో తిమింగలం వాంతులు తేలుతున్నట్లు మత్స్యకారులు గుర్తించారు.


 సాధారణం గా సముద్రం లో తిమింగలం ఉన్నప్పుడు ఇక ఆ తిమింగలం వాంతికి  సంబంధించిన వాసన వస్తుందని చెప్పుకొచ్చారు. తిమింగలం వాంతి కనిపించడం తమకు ఇదే మొదటి సారి అని చూడగానే అసలు వాంతి వచ్చిందా అనుమానం కూడా కలిగింది అంటూ సదరు మత్స్య కారులు చెప్పుకొచ్చారూ. సముద్రం వేటకు వెళ్ళినప్పుడు చాలా సార్లు తిమింగలాలను చూసినప్పటికీ  వాంతి కనిపించడం ఇదే మొదటి సారి అంటూ చెప్పుకొచ్చారు. ఈ క్రమం లోనే ఈ తిమింగలం వాంతిని 30 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు. దీంతో మత్స్యకారులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: