ప్రతి ఆదివారం ఎల్లోమీడియాలో వచ్చే కొ(చె)త్తపలుకులో చంద్రబాబునాయుడుకు రెండురకాలుగా షాకిచ్చింది. అందులో మొదటిదేమో పోలవరం, అమరావతి నిర్మాణంలో చంద్రబాబు ఫెయిలైనట్లు చెప్పకనే చెప్పింది. అలాగే తెలంగాణా ఎన్నికల్లో 2018 ఎన్నికల్లో చంద్రబాబును బూచిగా చూపించిన కేసీయార్ వచ్చే ఎన్నికల్లో నరేంద్రమోడీని చూపిస్తున్నట్లుగా చెప్పింది. అంటే తెలంగాణా పాలిట చంద్రబాబు బూచే అని స్వయంగా ఎల్లోమీడియానే సర్టిఫికేట్ ఇచ్చినట్లయ్యింది.





ఇక వచ్చే ఎన్నికల్లో ఏపీలో అధికారంలోకి వచ్చే అవకాశం చంద్రబాబుకు ఉందని రాజకీయ వ్యూహకర్త  ప్రశాంత్ కిషోర్ (పీకే) తెలంగాణాలోని ఒక ప్రముఖుడితో చెప్పారట. పీకే మాట్లాడిన ఆ ప్రముఖుడెవరో మాత్రం చెత్తపలుకులో రాయలేదు. ఇలాంటి నాలుగు గోడల మధ్య కూర్చుని వంటల రాతలకు జనాలు విలువ ఇవ్వరన్న విషయం ఎల్లోమీడియా యాజమాన్యానికి ఎప్పుడు అర్ధమవుతుందో ఏమో.





నిజానికి జగన్ అధికారంలోకి రాడని పీకే చెప్పింది నిజమే అయితే ఏ ప్రముఖుడితో చెప్పారో కచ్చితంగా ఆ ప్రముఖుడిపేరు చెప్పుండాలి. అలా చెప్పకుండానే ఒక ప్రముఖుడని, ఒక రాజకీయ నేతని, ఓ సీనియర్ నేతని చెబుతున్నారంటే ఇదంతా ఉత్త సొల్లుగానే అనుకోవాల్సుంటుంది. చెబితే కేశినేని నాని లాగ ధైర్యంగా చెప్పాలి. మూడు రోజుల క్రితం టీడీపీ విజయవాడ ఎంపీ నాని మాట్లాడుతు వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పిన విషయం పాపం ఎల్లోమీడియాకు తెలీదేమో.





పార్టీని అదికారంలోకి తెచ్చేంత శక్తి చంద్రబాబుకు లేదని ఎంపీ స్పష్టంగానే చెప్పిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో పోలవరం, అమరావతిని నిర్మించే అద్భుతమైన అవకాశాన్ని జగన్ చేజార్చుకున్నట్లుగా చెప్పింది. అంటే అంతకుముందు ఐదేళ్ళు అధికారంలో ఉన్న చంద్రబాబు కూడా ఫెయిలైనట్లుగా అంగీకరించింది. ఈ విషయమే చంద్రబాబుకు పెద్ద షాకిచ్చింది. జగన్ పై బురద చల్లేస్తున్నామని అనుకుంటు ఇదే సమయంలో చంద్రబాబు చేతకాని తనాన్ని కూడా బయటపెడుతున్న విషయం ఎల్లోమీడియా గ్రహించలేదు. అలాగే తెలంగాణాకు చంద్రబాబు బూచే అని ఎల్లోమీడియా సర్టిఫికేట్ ఇచ్చేసింది.




మరింత సమాచారం తెలుసుకోండి: