ఒంగోలు అధికారపార్టీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి యూటర్న్ తీసుకున్నట్లే అనుమానంగా ఉంది.  తొందరలోనే మాగుంట వైసీపీని వదిలేసి తెలుగుదేవంపార్టీలో చేరిపోవటం ఖాయమనే ప్రచారం అందరికీ తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ నుండే ఒంగోలు ఎంపీగా పోటీచేయటానికి రంగం రెడీచేసుకున్నారనే ప్రచారం జిల్లాలో బాగాజరుగుతోంది. ఎంపీకి జగన్మోహన్ రెడ్డితో ఏమాత్రం పొసగటంలేదని బాగా గ్యాప్ వచ్చేసిందన్న ప్రచారం అందరికీ తెలిసిందే.






ఇదే విషయమై ఎంపీ చివరకు నోరిప్పారు. తనకు సీఎంతో గ్యాప్ వచ్చిందని ఎవరు చెప్పారంటు మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో తాను వైసీపీ తరపునే ఎంపీగా పోటీచేయటం ఖాయమన్నారు. తాను పార్టీలో హ్యాపీగానే ఉన్ననని, పార్టీమారుతాననే ప్రచారాన్ని సోషల్ మీడియాలో, యూట్యూబ్ వీడియోల్లో కొందరు సృష్టించిన పుకార్లుగా కొట్టిపడేశారు. తమ వ్యూస్ పెంచుకునేందుకు కొందరు దురుద్దేశ్యంతో సృష్టించిన పుకార్లుగా తేల్చేశారు.







సరే ఎంపీ చెప్పిందే నిజమనుకుందాం. మరీ విషయం చెప్పటానికి ఎంపీకి ఇంతకాలం ఎందుకుపట్టింది ? ఎంపీ పార్టీమారిపోతారనే ప్రచారం చాలాకాలంగా నడుస్తోంది. ఈ ప్రచారంపై ఎంపీ నోరెత్తని కారణంగానే అదే నిజమని జనాలు నమ్ముతున్నారు. దానికితోడు ఎంపీకి పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ సరైన ప్రాధాన్యత దక్కటంలేదనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఇంతకాలం ప్రచారం జరుగుతున్నా నోరిప్పని ఎంపీ హఠాత్తుగా ఇపుడే ఎందుకు క్లారిటిఇచ్చారో అర్ధంకావటంలేదు.







సరే ఇప్పటికైనా క్లారిటిఇచ్చినందుకు సంతోషించండి అన్నట్లుగా ఉంది ఎంపీ వ్యవహారం. మాగుంటకు పార్టీలోని కొందరు కీలకనేతలకు పడటంలేదన్న విషయం జిల్లాపరిషత్ సమావేశాల్లో బయటపడింది. ఎంపీ ఒకటిచెబితే దానికి వ్యతిరేకంగా మంత్రి, ఎంఎల్ఏలు మరోటి చెప్పారన్న వార్తలు వచ్చాయి. ఇదే సమయంలో పార్టీ సమావేశాల్లో కూడా మాగుంటకు ఏమంత ప్రాధాన్యత దక్కటంలేదట. ఇలాంటి విషయాలన్నీ పార్టీ నేతల ద్వారానే బయటకు వచ్చాయి. దాంతో ఎంపీ పార్టీమార్పుపై ప్రచారం విపరీతంగా జరుగుతోంది. తెరవెనుక ఏదో జరిగిందని మాత్రం అర్ధమవుతోంది.  ఎన్నికలకు ఇంకాసమయం ఉండగానే ఎవరూ అధికారపార్టీలో నుండి ప్రతిపక్షంలోకి వెళ్ళరు. అయినా ఆ సమయం వచ్చినపుడు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: