కాంగ్రెస్ పార్టీకి శతృవులు బయటెక్కడో ఉండరు. శతృవులనండి లేదా ప్రత్యర్ధులనండి అంతా పార్టీలోనే ఉంటారు. ఇపుడు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఈ విషయం బాగా అనుభవంలోకి వస్తున్నట్లే ఉంది.  పీసీసీ చీఫ్ పగ్గాల కోసం రేవంత్ తో పాటు మరికొంతమంది సీనియర్లు కూడా పోటీపడ్డారు. అయితే అధిష్టానం మాత్రం రేవంత్ వైపు మొగ్గుచూపింది. దాంతో పోటీపడిన వారిలో చాలామంది సర్దుకున్నా ఒకరిద్దరు మాత్రం ఇంకా వైరాన్ని కంటిన్యు చేస్తునేవున్నారు.





అలాంటి సీనియర్లలో ఇద్దరు జగ్గారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలకమైన నేతలు. వీరిలో వెంకటరెడ్డి బ్రదర్, ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి తాజాగా రేవంత్ ను ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్య చేశారు. అదేమిటంటే రేవంత్ జైలుకు వెళ్ళొచ్చారట. రేవంత్ జైలుకు వెళ్ళొస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వచ్చిన నష్టం ఏమిటో అర్ధం కావటంలేదు. కాకపోతే పదే పదే ఓటుకునోటు కేసులో జైలుకు వెళ్ళొచ్చాడని చెప్పటం ద్వారా రేవంత్ ను కెలకటానికి మాత్రమే ఉపయోగపడుతుంది.





ఇక్కడ సమస్య ఏమిటంటే పీసీసీ చీఫుగా ఎవరున్నా కోమటిరెడ్డి బ్రదర్స్ వైఖరి ఇలాగే ఉంటుంది. వీళ్ళకు నిత్యసమ్మతివాదులగా ముద్రపడింది. వీళ్ళు మరచిపోయిందేమంటే పీసీసీ చీఫుగా తాముంటే తమలాగే మరికొందరు నేతలు అసమ్మతి వ్యవహారాలు నడుపుతారని. ఉన్నవాళ్ళతో అడ్జస్టుచేసుకోవటం వీళ్ళకు చేతకాదు. ఎంతసేపు తమకే పదవులు దక్కాలని, తమమాటే చెల్లుబాటు కావాలనే ఆలోచనతోనే పార్టీలో నిత్యం రచ్చ చేస్తునే ఉంటారు. కోమటిరెడ్డి లాంటి వారు ఇంకా ఉన్నా సమస్యంతా ఈయనతోన ే వస్తోంది. 





కేసీయార్, బీజేపీతో ప్రతిరోజు పోరాటాలు చేస్తున్న రేవంత్ ను తన కర్మానికి తనను వదిలేయకుండా వెనకనుండి కోమటిరెడ్డి బ్రదర్స్ లాగుతుంటారు. నిజానికి రేవంత్ పోరాటం కేసీయార్, బీజేపీతో మాత్రమే కాదు తన పార్టీలోని అసమ్మతినేతలతో కూడా చేస్తునే ఉండాలి. బయటవాళ్ళతో పోరాటం చేయటంకన్నా సొంతపార్టీ నేతలతో చేసే పోరాటమే రేవంత్ కు పెద్ద తలనొప్పిగా తయారైంది. బయటపార్టీల వాళ్ళు కనబడే శతృవులైతే సొంతపార్టీ నేతలు కనబడని శతృవులంతే.


మరింత సమాచారం తెలుసుకోండి: